పక్కా ప్లాన్‌తో హత్య: కారులోనే ఒక్క రోజంతా అప్సర డెడ్‌బాడీ

Published : Jun 09, 2023, 05:16 PM ISTUpdated : Jun 09, 2023, 05:17 PM IST
 పక్కా ప్లాన్‌తో హత్య: కారులోనే  ఒక్క రోజంతా అప్సర డెడ్‌బాడీ

సారాంశం

కారులో  అప్సర  కూర్చున్న సమయంలో  కర్రతో  ఆమెపై సాయికృష్ణ దాడి చేసి హత్య చేశాడు. ఆ తర్వాత డెడ్ బాడీని  సరూర్ నగర్ ఎమ్మార్వో  కార్యాలయ సమీపంలోని  మ్యాన్ హోల్ లో పూడ్చి పెట్టాడు.

హైదరాబాద్: ఈ నెల  3వ తేదీన  రాత్రి  అప్సరను హత్య చేసిన  తర్వాత  ఒక్క రోజుపాటు కారులో  డెడ్ బాడీని  ఉంచాడు  సాయికృష్ణ.ఈ నెల  3వ తేదీన  కోయంబత్తూరుకు  వెళ్తన్నానని  అప్సర తన తల్లికి  చెప్పి   సాయికృష్ణతో  కలిసి  కారులో బయలుదేరింది. సాయికృష్ణ తనను బస్సు ఎక్కిస్తాడని  తనతో చెప్పాడని  అప్సర తల్లి మీడియాకు  చెప్పారు. 

అయితే  ఈ నెల  3వ తేదీ రాత్రి  శంషాబాద్  దాటిన తర్వాత రాళ్లగూడ వైపునకు  కారును  సాయికృష్ణ తీసుకెళ్లాడు. ఈ ప్రాంతంలోని  ఓ హోటల్ లో  అప్సర, సాయికృష్ణలు భోజనం  చేశారు. కారులో   రిలాక్స్ గా  అప్సర పడుకున్న సమయంలో  బలమైన  కర్రతో  సాయికృష్ణ  కొట్టి చంపాడు.   సాయికృష్ణ  కుటుంబానికి  చెందిన  ఫోర్డ్  కారులోని  విండోలకు  కర్టెన్లు వేసి  ఒక్క రోజు పాటు కారులోనే మృతదేహం  ఉంచాడు నిందితుడు సాయికృష్ణ., కారును  తన ఇంటి వద్ద పార్క్  చేశారు. 

సరూర్ నగర్ తహసీల్దార్  కార్యాలయం వద్దకు  కారును తీసుకెళ్లి  అప్సర డెడ్ బాడీని  అందులో వేశాడు. అప్సర డెడ్ బాడీపై  ఉప్పు, మట్టి  కప్పాడు. ఆ తర్వాత  సిమెంట్ ను కూడ  వేశాడు.

ఈ కేసులో  పోలీసులు మొబైల్ సిగ్నల్, సీసీటీవీ పుటేజీ ఆధారంగా విచారణ  నిర్వహిస్తే  పోలీసులకు సాయికృష్ణపై అనుమానం వచ్చింది.ఈ అనుమానంతో  సాయికృష్ణను  విచారిస్తే అప్సర  హత్య విషయం వెలుగు చూసింది.  

also read:సరూర్ నగర్ మ్యాన్‌హోల్‌ నుండి అప్సర డెడ్ బాడీ వెలికితీత: పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలింపు

అప్సరను  ఎలా హత్య చేశాడనే విషయమై  పోలీసులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్  చేశారు.  సుల్తాన్ పూర్ లో  అప్పరను హత్య చేసిన ప్రాంతంతో పాటు సరూర్ నగర్ లోని మ్యాన్ హోల్ లో  ప్రాంతాలను పోలీసులు గుర్తించారు. అప్సరను హత్య  చేయాలని  పక్కా  ప్రణాళికతోనే  సాయికృష్ణ  వ్యవహరించాడని  పోలీసులు అనుమానిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

యూఎస్ ఓపెన్ 2025 ఫైనల్: సబాలెంకా vs అనిసిమోవా.. ఎవరు ట్రోఫీ గెలుస్తారు?
Vece Paes: లియాండర్‌ పేస్‌కు పితృవియోగం.. ఒలింపియన్ వేస్ పేస్ కన్నుమూత