స్పెయిన్ స్టార్ రఫెల్ నాదెల్ ను జొకోవిచ్ మట్టికరిపించాడు. 16 సంవత్సరాల్లో ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ ఇప్పటివరకు 13 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుచుకోగా.. మూడోసారి ఓటమిపాలవ్వడం గమనార్హం.
ఫ్రెంచ్ ఓపెన్ సిరీస్ లో వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ మరోసారి చరిత్ర సృష్టించాడు. శుక్రవారం ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్స్ జరిగాయి. కాగా.. ఈ సెమీ ఫైనల్స్ లో జొకోవిచ్ అదరగొట్టాడు.
స్పెయిన్ స్టార్ రఫెల్ నాదెల్ ను జొకోవిచ్ మట్టికరిపించాడు. 16 సంవత్సరాల్లో ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ ఇప్పటివరకు 13 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుచుకోగా.. మూడోసారి ఓటమిపాలవ్వడం గమనార్హం.
కాగా.. నిన్నటి మ్యాచ్ నాలుగు గంటలకుపైగా సాగగా.. ఈ హోరాహోరీగా పోరులో 3-6, 6-3, 7-6(7/4), 6-2 తేడాతో జొకోవిచ్ విజయం సాధించాడు.
తద్వారా రొలాండ్ గారోస్(ఫ్రెంచ్ ఓపెన్)లో నాదల్‌ను రెండు సార్లు ఓడించినా ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఫైనల్ మ్యాచ్‌లో గ్రీస్ ఆటగాడు స్టెఫానో సిట్సిపాస్‌తో తలపడనున్నాడు. జర్మనీకి చెందిన అలెగ్జాండర్‌పై జ్వెరెవ్‌పై 6-3, 6-3, 4-6, 4-6, 6-3 తేడాతో గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరుకున్న తొలి గ్రీకు ఆటగాడిగా సిట్సిపాస్ నిలిచాడు. ఫ్రెంచ్ రాజధానిలో జరిగిన 14 సెమీ ఫైనల్స్ మ్యాచుల్లో నాదల్‌కు ఇది మొదటి ఓటమి. పారిస్‌లో జరిగిన ఎనిమిది మ్యాచుల్లో నాదల్‌తో జొకోవిచ్ తలపడగా.. ఇందులో రెండు విజయాలు, ఫైనల్స్‌లో మూడు ఓటమలు ఉన్నాయి.