ఈ బుడ్డోడి వల్ల నా కోచింగ్ జాబ్ పోయేలా ఉంది... సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా...

Published : May 18, 2021, 01:03 PM IST
ఈ బుడ్డోడి వల్ల నా కోచింగ్ జాబ్ పోయేలా ఉంది... సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా...

సారాంశం

, 52 వారాల తర్వాత మళ్లీ రాకెట్ పట్టిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా... టోక్నో ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా ప్రాక్టీస్... నెట్స్‌లో తల్లికి సాయంగా నిలుస్తున్న ఇజ్హాన్ మీర్జా మాలిక్...

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్, ఓ బుడ్డోడి కారణంగా తన కోచింగ్ జాబ్‌ ప్రమాదంలో పడిందంటూ ఓ వీడియో పోస్టు చేశాడు. సానియాకి సాయం చేస్తున్న ఆ బుడ్డోడు మరెవరో కాదు, ఆయన మనవడు ఇజ్హాన్ మీర్జా మాలిక్... గర్భం కారణంగా ఆటకు బ్రేక్ తీసుకున్న సానియా మీర్జా, 52 వారాల తర్వాత మళ్లీ రాకెట్ పట్టింది.

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కి పతకం గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న సానియా మీర్జా, అందుకోసం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తోంది. తాజాగా ఆమె నెట్ సెషన్స్‌కి వచ్చిన ఆమె కుమారుడు ఇజ్హాన్, తల్లికి సాయం చేస్తూ కనిపించాడు. మనవడి వీడియోను పోస్టు చేసిన ఇమ్రాన్ మీర్జా... ‘ఈ బుడ్డోడి కారణంగా నా కోచింగ్ జాబ్‌పోయేలా ఉంది.. ’ అంటూ ఫన్నీ కామెంట్ జోడించాడు. 

‘ఇప్పుడు నా వయసు 34, కానీ నా మైండ్ మాత్రం 20 ఏళ్ల యువతికంటే ఉత్సాహంగా ఉంది. ఈసారి నేను పతకం సాధించగలనని నమ్ముతున్నా. 2008 బిజింగ్ ఒలింపిక్స్ సమయంలో నాకు చేతికి గాయమైంది. ఆ తర్వాత కొన్ని నెలలు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. ఏ కారణం లేకుండా ఏడవడం కూడా నాకు గుర్తుంది. ఇప్పుడు నేను ఫిట్‌గా ఉన్నా...’ అంటూ కామెంట్ చేసింది సానియా మీర్జా.

PREV
click me!

Recommended Stories

యూఎస్ ఓపెన్ 2025 ఫైనల్: సబాలెంకా vs అనిసిమోవా.. ఎవరు ట్రోఫీ గెలుస్తారు?
Vece Paes: లియాండర్‌ పేస్‌కు పితృవియోగం.. ఒలింపియన్ వేస్ పేస్ కన్నుమూత