ఫ్రెంచ్ ఓపెన్ 2021 టోర్నీని తాకిన కరోనా... ఇద్దరు మెన్స్ డబుల్స్ ప్లేయర్లకు పాజిటివ్...

By Chinthakindhi RamuFirst Published Jun 3, 2021, 5:15 PM IST
Highlights

మెన్స్ డబుల్స్‌లో పాల్గొంటున్న ఇద్దరు ప్లేయర్లకు పాజిటివ్ రిజల్ట్...

  మ్యాచ్ మధ్యలోనే ప్రేక్షకులను బయటికి పంపించేసిన నిర్వాహకులు...

ఐపీఎల్ వంటి మెగా టోర్నీని నిరవధికంగా వాయిదా వేసేలా చేసేలా కరోనా మహమ్మారి, ఫ్రెంచ్ ఓపెన్ 2021 సీజన్‌ను కూడా తాకింది. మెన్స్ డబుల్స్‌లో పాల్గొంటున్న ఇద్దరు ప్లేయర్లకు పాజిటివ్ రిజల్ట్ రావడంతో మ్యాచ్ మధ్యలోనే ప్రేక్షకులను బయటికి పంపించేశారు.

ఫ్రెంచ్ ఓపెన్‌ను ప్రత్యేక్షంగా వీక్షించేందుకు పారిస్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే అన్యూహ్యంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో గత రాత్రి నుంచి కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఫ్రెంచ్ గవర్నమెంట్. ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేషన్ (ఎఫ్ఎఫ్‌టీ) ఇప్పటిదాకా 2446 పరీక్షలు నిర్వహించింది.

వీటిలో ఇద్దరు డబుల్స్ ప్లేయర్లకు పాజిటివ్ వచ్చినట్టు సమాచారం. ఈ ఇద్దరూ ఒకే జట్టుకి చెందినవారు కావడంతో వారిని టోర్నీ నుంచి తొలగించారు. అయితే ఆ ప్లేయర్ల పేర్లు మాత్రం బయటికి చెప్పలేదు ఎఫ్‌ఎఫ్‌టీ.

అయితే క్రోయాటియా దేశానికి చెందిన నికోలా మెక్‌టిక్, అతని సహచరుడు మేట్ పావిక్‌లకు కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. వీరితో మ్యాచ్ ఆడాల్సిన జేమీ మునార్, ఫెలిసినో లోపెజ్‌లకు డ్రా లభించింది. 

click me!