కేసీఆర్ నాకు భయపడ్డారు...అందుకే ప్రకటించలేదు : గీతారెడ్డి

By Arun Kumar PFirst Published Sep 7, 2018, 4:59 PM IST
Highlights

తెలంగాణ లో 105 అసెంబ్లీ స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీచేసే అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కొన్ని నియోజకవర్గాల అభ్యర్ధులను మాత్రం ప్రకటించలేదు. అలా టీఆర్ఎస్ పార్టీ మొదటి విడతలో అభ్యర్థులను ప్రకటించని నియోజవర్గాల జాబితాలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కూడా ఉంది. ఇలా కేసీఆర్ జహీరాబాద్ లో అభ్యర్థిని ప్రకటించపోవడానికి గల  కారణాలను కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే గీతారెడ్డి వివరించారు. 

జహీరాబాద్ లో తనతో పోటీ పడేందుకు టీఆర్ఎస్ పార్టీ తరపున ఎవరూ ముందుకురాకపోవడం వల్లే కేసీఆర్ అభ్యర్థిని ప్రకటించలేదని గీతారెడ్డి అన్నారు. తనకు భయపడే ఈ స్థానంలో అభ్యర్థి ప్రకటిచకుండా  వదిలేశారని, ఈసారి కూడా జహీరాబాద్ సీటు తనదేనని అన్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు మంచి పట్టుందని,తన గెలుపును ఎవరూ అడ్డుకోలేరని గీతారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

దళితున్ని సీఎం గా చేస్తానని ప్రకటించి ఎన్నికల్లో గెలిచిన తర్వాత దళిత సమాజాన్ని సీఎం మోసం చేశారని గీతారెడ్డి ద్వజమెత్తారు. కేసీఆర్ ఈ నాలుగేళ్ల పాలనలో చెప్పినవన్నీ అబధ్దాలేనని అన్నారు. ముందస్తుగా జరగనున్న ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి ఖాయమని గీతారెడ్డి అన్నారు.

click me!