కేసీఆర్‌కు కాళేశ్వరం బంగారు గుడ్లు పెట్టే బాతు.. ఇప్పుడు మరో దోపిడికీ ప్లాన్: షర్మిల ఆరోపణలు

Siva Kodati |  
Published : Sep 03, 2021, 05:22 PM IST
కేసీఆర్‌కు కాళేశ్వరం బంగారు గుడ్లు పెట్టే బాతు.. ఇప్పుడు మరో దోపిడికీ ప్లాన్: షర్మిల ఆరోపణలు

సారాంశం

కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టు బంగారు గుడ్లు పెట్టే బాతు అని ఆమె అభివర్ణించారు. కమీషన్లకు కక్కుర్తిపడి రీడిజైనింగ్ పేరుతో రూ.36 వేల కోట్లకు పూర్తయ్యేదాన్ని కేసీఆర్ లక్ష కోట్లకు పెంచారని షర్మిల ఆరోపించారు. తద్వారా వేలకోట్లు దండుకున్నారని ఆమె వ్యాఖ్యానించారు.   

కాళేశ్వరం ప్రాజెక్టు నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టు బంగారు గుడ్లు పెట్టే బాతు అని ఆమె అభివర్ణించారు. కమీషన్లకు కక్కుర్తిపడి రీడిజైనింగ్ పేరుతో రూ.36 వేల కోట్లకు పూర్తయ్యేదాన్ని కేసీఆర్ లక్ష కోట్లకు పెంచారని షర్మిల ఆరోపించారు. తద్వారా వేలకోట్లు దండుకున్నారని ఆమె వ్యాఖ్యానించారు. 

గడచిన మూడేళ్లలో కొత్తగా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని, 2 వేల కోట్ల రూపాయల కరెంటు బిల్లు మాత్రం వచ్చిందని షర్మిల వెల్లడించారు. ఎత్తిపోసిన నీళ్లన్నీ సముద్రం పాలు చేసే మహా అద్భుతం కాళేశ్వరం అంటూ షర్మిల సెటైర్లు వేశారు.

తన అవినీతి అంతా ప్రజలకు తెలిసిపోయిందని, మళ్లీ తాను గెలవడం కష్టమని భావించి ఇప్పుడు కొత్తగా మూడో టీఎంసీ అంటూ తెరపైకి తెచ్చారని ఆమె ఆరోపించారు. దీని ద్వారా మరో రూ.30 వేల కోట్ల మేర అంచనాలు పెంచి దోచుకునేందుకు సిద్ధమయ్యాడని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

PREV
click me!

Recommended Stories

Vegetable Prices : నిమ్మ ధర వింటే వామ్మో అనాల్సిందే... హైదరాబాద్ లో ఏ కూరగాయ ధర ఎంత?
CM Revanth Reddy Ramp Walk At Nakirekal Meeting | Asianet News Telugu