
నాగార్జున సాగర్ ప్రధాన రహదారిపై వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆదివారం ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. గిరిజన మహిళ లక్ష్మీకి తక్షణమే న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని ఆందోళనకారులపై లాఠీఛార్జీ చేశారు. అనంతరం వైఎస్ షర్మిలను అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.