దానికే చిన్నదొరకు చాలా కోపం వచ్చింది.. దమ్ముంటే సబ్జెక్ట్ మాట్లాడాలి: కేటీఆర్‌పై షర్మిల ఫైర్

Published : Jul 25, 2022, 03:53 PM IST
దానికే చిన్నదొరకు చాలా కోపం వచ్చింది.. దమ్ముంటే సబ్జెక్ట్ మాట్లాడాలి: కేటీఆర్‌పై షర్మిల ఫైర్

సారాంశం

తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్‌ ఓటీటీలో సినిమాల గురించి అడిగితే తాము వెటకారంగా సమాధానమిచ్చామని చెప్పారు. దానికి చిన్నదొర గారికి కోపం వచ్చి తమపై వ్యక్తిగతంగా విరుచుకుపడ్డారని అన్నారు.

తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్‌ ఓటీటీలో సినిమాల గురించి అడిగితే తాము వెటకారంగా సమాధానమిచ్చామని చెప్పారు. దానికి చిన్నదొర గారికి కోపం వచ్చి తమపై వ్యక్తిగతంగా విరుచుకుపడ్డారని అన్నారు. దమ్ముంటే సబ్జెక్ట్ మాట్లాడాలని సవాలు విసిరారు. అధికారంలో ఉన్నప్పుడు కాళ్లు ఫ్యాక్చర్ అయిందని ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తారా అని ప్రశ్నించారు. రిమోట్‌గా పనిచేయలేరా? అంటూ ఫైర్ అయ్యారు. 

వరదలతో ప్రజలు ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వారిని కనీసం సాయం చేయడం లేదని విమర్శించారు. పరామర్శలకు కూడా వెళ్లడం లేదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. సిగ్గులేకుండా ఒక మహిళ అని చూడకుండా వ్యక్తిగతంగా దూషణలు చేస్తారా అని ప్రశ్నించారు. 

ఇటీవల తన కాలుకు గాయమైన విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్వయంగా ప్రకటించారు. కేటీఆర్ గాయపడిన విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పలువురు ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా ద్వారా పోస్టులు పడుతున్నారు. తాజాగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కూడా స్పందించారు. కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఇదే సమయంలో విశ్రాంతి సమయంలో ఓటీటీలో మంచి షోలు వుంటే చెప్పాలన్న కేటీఆర్‌కు షర్మిల సెటైర్లు వేశారు. మీ కోసం కుట్ర సిద్ధాంతం, క్లౌడ్ బరెస్ట్, నీట మునిగిన ఇళ్లు, పంప్‌హౌస్‌లు వున్నాయని ఆమె అన్నారు. 

అయితే షర్మిల చేసిన ఆ ట్వీట్‌పై పులువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే షర్మిల రియాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu