వచ్చే ఎన్నికల్లో పాలేరు నుండి పోటీ: తేల్చేసిన వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల

By narsimha lode  |  First Published Jun 19, 2022, 12:35 PM IST

ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ స్థానం నుండి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని వైఎస్ఆర టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో ఎందరో వైఎస్ఆర్ ఫోటో పెట్టుకొని గెలిచారన్నారు. 


ఖమ్మం: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో Paleru నుండి పోటీ చేస్తానని YSRTP చీఫ్ YS Sharmila ప్రకటించారు. పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం తనకు అనుకూలంగా ఉంటుందని భావించిన షర్మిల ఈ నియోజకవర్గం నుండి పోటీకి దిగుతానని ప్రకటించారు. YSR ఫోటోతో ఎంతో మంది గెలిచారని ఆమె గుర్తు చేశారు. ఇక నుండి నా ఊరు పాాలేరేనని ఆమె ప్రకటించారు. వైఎస్ఆర్ సంక్షేమ పాలన పాలేరు నుండే ప్రారంభం కావాలన్నారు.పాలేరు నుండి పోటీ చేయాలనే డిమాండ్ ఎప్పటి నుండో ఉందన్నారు. వైఎస్ఆర్ పేరు పలికే అర్హత తనకు మాత్రమే ఉందని ఆమె చెప్పారు. వైఎస్ఆర్ పై ఉన్న అభిమానమే తనకు ఉన్న ఆస్తిగా ఆమె పేర్కొన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో వైఎస్ఆర్‌టీపీ కార్యకర్తలతో వైఎస్ షర్మిల ఆదివారం నాడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాలేరు నుండి పోటీ చేస్తున్నట్టుగా కార్యకర్తల సమావేశంలో వైఎస్ షర్మిల ప్రకటించారు. తెలంగాణ జిల్లాల్లో వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్ర నిర్వహిస్తున్నారు. 2014లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి వైసీపీ నుండి ఎంపీతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు విజయం సాధించారు.

Latest Videos

undefined

ఆ తర్వాత వారంతా టీఆర్ఎస్ లో చేరారు.  అయితే ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్ అభిమానులు ఎక్కువగా ఉన్నారని వైఎస్ఆర్‌టీపీ నాయకత్వం గుర్తించింది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై సర్వే నిర్వహించిన నాయకత్వం పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం సేఫ్ గా ఉంటుందని గుర్తించిందని సమాచారం. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ అభిమానులు ఎక్కువగా ఉన్నారని కూడా పార్టీ నాయకత్వం భావిస్తుంది. ప్రస్తుతం వైఎస్ షర్మిల పాదయాత్ర ఖమ్మం జిల్లాలో సాగుతుంది. పాలేరు నుండి షర్మిల పోటీ చేస్తే ఆ ప్రభావం ఈ జిల్లాలోని ఇతర నియోజకవర్గాలపై కూడా ఉంటుందనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. 

పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్ రెడ్డికి అనుచరులు ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుండి రాంరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనారోగ్యంతో ఆయన మరణించడంతో  జరిగిన ఉప ఎన్నికల్లో ఈ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా అప్పట్లో బరిలో దిగిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో ఇదే స్థానం నుండి తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. కానీ కాంగ్రెస్ అభ్యర్ధి కందాల ఉపేందరు్ రెడ్డి చేతిలో తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు.  కందాల ఉపేందర్ కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరారు. 

ఈ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో అత్యధిక దఫాలు కాంగ్రెస్ అభ్యర్ధులు విజయం సాధించారు. మూడు దఫాలు సీపీఎం అభ్యర్ధులు విజయం సాధించారు. ఒక్కసారి టీఆర్ఎస్ అభ్యర్ధి విజయం సాధించారు.

also read:వైఎస్సార్ దేవుడైతే కేసీఆర్ దెయ్యం... పాలనలో నక్కకు నాగలోకానికున్నంత తేడా: వైఎస్ షర్మిల

పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం తమకు గట్టి పట్టుందని భావించిన వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల  ఈ నియోజకవర్గంలోనే పోటీకి ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు.  ఈ స్థానం నుండి పోటీ చేస్తానని ప్రకటించడంతో ఈ సెగ్మెంట్ పై ఆ పార్టీ మరింతగా ఫోకస్ చేసే అవకాశం లేకపోలేదు. 


 

click me!