కేసీఆర్ సారూ.. మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారా? ఇవ్వరా?... షర్మిల..

Published : Feb 05, 2022, 01:32 PM IST
కేసీఆర్ సారూ.. మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారా? ఇవ్వరా?... షర్మిల..

సారాంశం

తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద విరుచుకుపడ్డారు. ఉద్యోగ నోటిఫికేషన్స్ లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా మీ మనసు కరగడం లేదా?  నరంలేని మీ నాలుక ఇంకా ఎన్ని అబద్దాలాడుతుంది.. అంటూ ధ్వజమెత్తారు. 

హైదరాబాద్ : telanganaలో Unemployed ఆత్మహత్యలు పెరగడం ఆందోళన కలిగించే అంశమని వైఎస్సార్టీపీ అధినేత్రి ys sharmila అన్నారు. ‘నా చావుతోనైనా నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగిపోవాలని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీకు ఇంకెంతమంది నిరుద్యోగులు అర్జీ పెట్టుకోవాలి KCR గారు? ఇంకెంతమంది కన్నతల్లులు కడుపుకోతను అనుభవించాలి. మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారా? ఇవ్వరా? త్వరలో ఉద్యోగాలు అని ఇంకా ఎన్ని యేండ్లు జరుపుతారా? మీ నరంలేని నాలుక ఇంకా ఎన్ని అబద్దాలాడుతుంది’ అని మండిపడ్డారు. 

Notifications రాక, ఇంత చదువు చదివి కూలిపని చేస్తున్నావు అనే మాటలు నిరుద్యోగులు భరించలేకపోతున్నారని అన్నారు. అవమానాన్ని భరించలేక తల్లిదండ్రులకు భారం కాలేక పురుగుల మందు తాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కురుమూర్తి నిన్న suicide చేసుకోవడం ఏ మనిషినైనా కదిలిస్తుందని.. కానీ కేసీఆర్ ను మాత్రం కదిలించదన్నారు. ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలు నిపండం చేతకాక పోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. 

ఇదిలా ఉండగా, గురువారంనాడు వనదేవతలు మేడారం సమ్మక్క, సారలమ్మలను వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల దర్శించుకున్నారు. గురువారం మధ్యాహ్నం మేడారంలోని హరిత హోటల్ చేరుకున్న షర్మిల ఆదివాసీ కళాకారుల ఊరేగింపు మధ్య అమ్మవారి గద్దెలవద్దకు చేరుకున్నారు. అక్కడి ఆలయ అధికారులు సాంప్రదాయబద్దంగా షర్మిలకు స్వాగతం పలికి దగ్గరుండి వనదేవతల దర్శనం చేయిచారు. 

షర్మిల అనంతరం నిలువెత్తు బంగారం (బెల్లం)తో మొక్కులు చెల్లించుకున్నారు.  అనంతరం ఆదివాసీ దేవతల సమ్మేళనం జరుగుతున్న ITDA గోడౌన్ మ్యూజియం వద్దకు చేరుకుని ఆదివాసీ ఆచార వ్యవహారాల గురించి షర్మిల తెలుసుకున్నారు.

అంతకుముందు, జనవరి 31న  వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి మోడీ, కేసీఆర్‌లపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ట్విట్టర్‌ వేదికగా విమర్శనాస్త్రాలను సంధించారు. రాష్ట్రానికి కేసీఆర్‌, దేశానికి మోడీ చేసింది ఏం లేదని ఏద్దేవా చేసింది. ఈ మేరకు ష‌ర్మిల త‌న ట్విట్టర్‌లో.. ''మోదీ, కేసీఆర్ లు ఇద్దరూ ఒకే తాను ముక్కలు. మోదీ రాష్ట్రానికి ఇచ్చింది ఏమీలేదు, కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకొన్నది లేదు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తామన్న మోదీ గారు ఉద్యోగాలు ఇచ్చింది లేదు కానీ, ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తుండు.

ఇక ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ గారు ఉన్న ఉద్యోగులను పీకేస్తూ, నిరుద్యోగులు చచ్చేలా చేస్తున్నారు. మోదీ తెలంగాణకు అన్యాయం చేసి మహారాష్ట్రపై ప్రేమ కురిపించి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తే తెలంగాణకు రైల్వే ఫ్యాక్టరీ సాధించడంలో కేసీఆర్ కొట్లాడింది లేదు. మోదీ కేంద్ర విద్యాసంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేసింది లేదు. కేసీఆర్ కేజీ టు పీజీ ఉచిత విద్య అందించింది లేదు. రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తారని నువ్వు దొంగ అంటే నువ్వే దొంగ అన్నట్లు .. TRS, BJPలు లేఖాస్త్రాల డ్రామాలకు తెరలేపాయి తప్ప తెలంగాణకు కేసీఆర్, మేదీలు చేసిందేమి లేదు.. దొందూ దొందే.. ఇద్దరూ దొంగలే’ అని షర్మిల విమర్శలు గుప్పించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 5 Cleanest Railway Stations : దేశంలో అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?