కేసీఆర్‌తో మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా భేటీ: పలు అంశాలపై చర్చ

By narsimha lode  |  First Published Sep 7, 2023, 6:10 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ తో  మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా  ఇవాళ భేటీ అయ్యారు.


హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ తో మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా  గురువారంనాడు ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు.  సీఎం కేసీఆర్ తో  మేఘాలయ సీఎం మర్యాద పూర్వకంగా భేటీ అయినట్టుగా సమాచారం. హైద్రాబాద్ పర్యటనకు  వచ్చిన  మేఘాలయ సీఎం కాన్రాడ్  సంగ్మా నిన్న  తెలంగాణ మంత్రి కేటీఆర్ తో  భేటీ అయ్యారు.  

నిన్న  హైద్రాబాద్ లోని టీ హబ్ ను  సందర్శించారు.  ఆ తర్వాత  ఆయన  మంత్రి కేటీఆర్ దంపతులతో  ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇవాళ  సీఎం కేసీఆర్ తో  కాన్రాడ్  సంగ్మా భేటీ అయ్యారు. 

Latest Videos

undefined

 

A great pleasure to call upon the Hon’ble Chief Minister of Telangana, Shri K. Chandrashekar Rao Garu during my visit to the state. Discussed Sister State partnership between Telangana and Meghalaya.

Telangana is one of the leading states in the country and we hope that the… pic.twitter.com/LMwtPsuHav

— Conrad K Sangma (@SangmaConrad)

దేశంలోని అగ్రగ్రామి రాష్ట్రంగా తెలంగాణ వెలుగొందుతుందని  మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా అభిప్రాయపడ్డారు.  ఐటీ రంగంలో  తెలంగాణ రాష్ట్రం పురోభివృద్దిలో పయనిస్తుందని ఆయన  చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలపై  కేసీఆర్, సంగ్మా చర్చించారు.

మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మాకు  సీఎం కేసీఆర్ తేనీటి విందు ఇచ్చారు. కాసేపు ఇరువురు సిఎం లు ఇష్టాగోష్ఠి నిర్వహించారు. అనంతరం సీఎం సంగ్మాను శాలువాతో సిఎం కేసీఆర్ సత్కరించి, మెమొంటో  బహుకరించారు. అనంతరం తిరుగు ప్రయాణమైన మేఘాలయ సిఎం కు సిఎం కేసీఆర్ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి, బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కె వంశీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.

click me!