తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజ్‌ల ఫీజులు ఖరారు.. ఎంజీఐటీలో రూ. 1.60 లక్షలు.. వివరాలు ఇవే..

By Sumanth KanukulaFirst Published Oct 19, 2022, 4:35 PM IST
Highlights

తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజ్‌ ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలోని 159 ఇంజనీరింగ్ కాలేజ్‌ల ఫీజులకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజ్‌ ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఏఎఫ్ఆర్‌సీ సిఫార్సుల మేరకు రాష్ట్రంలోని 159 ఇంజనీరింగ్ కాలేజ్‌ల ఫీజులకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇంజనీరింగ్ కాలేజ్‌లో మినిమమ్ ఫీజ్ రూ. 45 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోను పరిశీలిస్తే.. రాష్ట్రంలోని 40 కాలేజ్‌ల్లో ఫీజు రూ. 1,00,000 దాటింది. అత్యధికంగా ఎంజీఐటీ‌ కాలేజ్‌లో రూ. 1.60 లక్షలుగా ఫీజు ఉండనుంది. సీవీఆర్ కాలేజ్‌లో రూ. 1.50 లక్షలు, సీబీఐటీ, వర్దమాన్, వాసవీ కాలేజ్‌ల్లో రూ. 1. 40 లక్షలుగా ఫీజులు ఖరారు అయ్యాయి. ఈ ఫీజులు మూడేళ్ల వరకు అమల్లో ఉంటాయని ప్రభుత్వం  తెలిపింది. 

ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ ఫీజులను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. ఎంబీఏ, ఎంసీఏ కనీస ఫీజును రూ. 27 వేలు, ఎంటెక్ ఫీజును రూ.57 వేలుగా నిర్ణయించింది. ఇదిలా ఉంటే.. టీఎస్ ఎంసెట్-2022 తుది విడత కౌన్సిలింగ్ ఎల్లుండి (అక్టోబర్ 21) నుంచి ప్రారంభం కానుంది. 

click me!