జై తెలంగాణ అంటూ ప్రసంగం ప్రారంభించిన వైఎస్ షర్మిల ( వీడియో)

By AN TeluguFirst Published Feb 20, 2021, 4:38 PM IST
Highlights

తెలంగాణలో ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేయడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు, ఏపీ సీఎం వైస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా శనివారం ఆమె హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశం ప్రారంభోపన్యాసంలో జై తెలంగాణ అంటూ మొదలుపెట్టడం విశేషం.

తెలంగాణలో ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేయడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు, ఏపీ సీఎం వైస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా శనివారం ఆమె హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశం ప్రారంభోపన్యాసంలో జై తెలంగాణ అంటూ మొదలుపెట్టడం విశేషం.

"

ఇప్పటికే నల్గొండ జిల్లా నేతలతో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. శనివారం హైదరాబాదు, రంగా రెడ్డి జిల్లాలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మీయులతో ఆమె సమావేశమయ్యారు.  జై తెలంగాణ నినాదంతో తన ప్రసంగాన్ని ప్రారంభించి తనవి ఆంధ్ర మూలాలు అనే మాటలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. 

తెలంగాణ లో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారా అనే అంశం మీద ఆరా తీశారు. స్థానిక సమస్యలపై నేతలతో చర్చించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి  వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల అమలు విధానంపై అడిగి తెలుసుకున్నారు.

సమావేశంలో పాల్గొన్నవారికి ఆమె 11 ప్రశ్నలతో ఓ ఫీడ్ బ్యాక్ ఫామ్ అందించారు. ఆ ఫామ్ పార్టీ ఏర్పాటుపై అభిప్రాయాలను కూడగట్టడానికి పనికి వస్తుందని ఆమె భావిస్తున్నారు. టీఆర్ఎస్ తాను ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేసిందా అనేది ఫామ్ లో ఉన్న ప్రధానమైన ప్రశ్న. 

తాను పార్టీ ఏర్పాటు చేయాలనుకుంటున్న విషయంపై సామాన్య ప్రజల అభిప్రాయం ఎలా ఉందని ఫీడ్ బ్యాక్ ఫామ్ లో ఉన్న మరో ప్రశ్న. టీఆర్ఎస్ ను ఎదుర్కోవడానికి, అలాగే బిజెపిని ఎదుర్కోవడానికి మీరిచ్చే సలహాలు ఏమిటని ఆమె అడిగారు. రాష్ట్ర స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ ప్రభుత్వంపై పోరాటానికి చేపట్టాల్సిన సమస్యలేమిటనే ప్రశ్నలు కూడా అందులో ఉన్నాయి. 

క్యాడర్ నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలేమిటని ఆమె అడిగారు. అలాగే, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాలు ఏమిటి, వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తెలంగాణలో తేవాలంటే ఏం చేయాలని ఆమె అడిగారు. తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేయాల్సింది చేస్తోందా అని ఆమె అడిగారు. 

తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలన్నదే తన ఆకాంక్ష అని షర్మిల పేర్కొన్నారు. అలాగే వైఎస్సార్ కు తెలంగాణలో ఇంకా అభిమానులు ఉన్నారని పేర్కొన్నారు. కాగా గత గురువారం ఆమె ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే. త్వరలోనే అన్ని జిల్లాల నేతలతో సమావేశమవుతానని షర్మిల ఇదివరకే ప్రకటించారు.

click me!