గవర్నర్ తమిళిసై‌తో వైఎస్ షర్మిల భేటీ.. ఆ విషయాలపై ఫిర్యాదు..!

Published : Dec 01, 2022, 12:40 PM IST
గవర్నర్ తమిళిసై‌తో వైఎస్ షర్మిల భేటీ.. ఆ విషయాలపై ఫిర్యాదు..!

సారాంశం

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కలిశారు. గురువారం రాజ్‌భవన్‌కు చేరుకున్న వైఎస్ షర్మిల గవర్నర్ తమిళిసైతో భేటీ అయ్యారు.

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కలిశారు. గురువారం రాజ్‌భవన్‌కు చేరుకున్న వైఎస్ షర్మిల గవర్నర్ తమిళిసైతో భేటీ అయ్యారు. నర్సంపేటలో పోలీసులు తన పాదయాత్రను అడ్డుకోవడం, ప్రగతి భవన్‌ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్తుంటే చోటుచేసుకున్న పరిణామాలను, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఆమె గవర్నర్ వద్ద ప్రస్తావించనున్నారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.  వీటిపై ఓ నివేదికను కూడా అందజేయనున్నట్టుగా వైఎస్సార్‌టీపీ వర్గాలు తెలిపాయి. గవర్నర్‌తో భేటీ అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. 

ఇక,  వైఎస్ షర్మిల అరెస్ట్‌పై స్పందించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. వైఎస్ షర్మిల కారులోపల ఉన్నప్పుడే.. కారును దూరంగా లాగుతున్న దృశ్యాలు కలవరపెట్టాయని అన్నారు.  ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పోస్టు చేశారు. వైఎస్ షర్మిల, ప్రధానమంత్రి కార్యాలయం, తెలంగాణ డీజీపీలను ట్యాగ్ చేశారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?