నాలాల పూడికతీత: జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద బీజేపీ ధర్నా

By narsimha lodeFirst Published Jun 18, 2021, 2:54 PM IST
Highlights

 వర్షాకాలం ప్రారంభమైనా  నాలాల్లో పూడికతీయకపోవడాన్ని నిరసిస్తూ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బీజేపీ కార్పోరేటర్లు శుక్రవారం నాడు ధర్నా నిర్వహించారు. 
 

హైదరాబాద్: వర్షాకాలం ప్రారంభమైనా  నాలాల్లో పూడికతీయకపోవడాన్ని నిరసిస్తూ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బీజేపీ కార్పోరేటర్లు శుక్రవారం నాడు ధర్నా నిర్వహించారు. నాలాల పూడికతీతను చేపట్టేందుకు అవసరమైన ప్రణాళికలను చేపట్టలేదని బీజేపీ ఆరోపణలు చేసింది. నాలాల పూడికతీత విషయంలో ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ డిమాండ్లతో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. 

ఈ ధర్నా నేపథ్యంలో  జీహెచ్ఎంసీ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.  నాలాల పూడికతీత చేపట్టాలనే డిమాండ్ తో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ల బృందం కమిషనర్ కు వినతిపత్రం సమర్పించేందుకు వెళ్లారు.అయితే ఆ సమయానికి కమిషనర్ జీహెచ్ఎంసీలో లేరు. దీంతో వినతిపత్రం ఇవ్వకుండానే బీజేపీ నేతలు వచ్చారు.

గత ఏడాదిలో భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బంది పడ్డారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు.  గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకొని  నాలాల పూడికతీత తీయాలని ఆయన కోరారు.   నాలాలపై  అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని ఆయన కోరారు. ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదన్నారు. 

click me!