కాళేశ్వరం నష్టాన్ని కాంట్రాక్టర్ నుండి వసూలు చేయాలి: వైఎస్ షర్మిల డిమాండ్

By narsimha lode  |  First Published Jul 25, 2022, 9:13 PM IST

కాళేశ్వరంలో ఎంత నష్టం జరిగిందో ఆ నష్టాన్ని కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి నుండి వసూలు చేయాలని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. 
 


హైదరాబాద్: ప్ర‌భుత్వం ఎంత దాచాల‌నుకున్నా కాళేశ్వ‌రంలో ఎంత న‌ష్టం జ‌రిగిందో సామాన్యులంద‌రికీ అర్థ‌మ‌వుతుందని వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారుసోమవారం నాడు హైద్రాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఒక్క ఎక‌రానికి నీళ్లు ఇవ్వ‌కున్నా కాళేశ్వ‌రం క‌ట్టిన పాపానికి వేల ఎక‌రాలు మునిగిపోయాయన్నారు. కాళేశ్వ‌రం క‌ట్ట‌క‌ముందు ఎప్పుడూ ఏ స‌మ‌స్యా రాలేద‌న్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు ఏం సాధించింది? ఒక్క ఎక‌రాకు నీళ్లిచ్చిందీ లేదని షర్మిల విమర్శించారు.. కాళేశ్వరం నిర్మించినా మ‌ళ్లీ వ‌రి వేసుకుంటే ఉరే అని స‌న్నాసి మాట‌లు మాట్లాడారన్నారు.

కాళేశ్వ‌రం ప్రాజెక్టు కోసం ల‌క్ష‌ల కోట్లు అప్పు తీసుకొచ్చారని ఆమె గుర్తు చేశారు.  వేల కోట్లు ఖ‌ర్చు చేసి క‌రెంటు బిల్లులు క‌డుతున్నారన్నారు.తెచ్చిన అప్పుల‌కు వేల కోట్లు వ‌డ్దీలు క‌డుతున్నారు. కాలేశ్వరం ఎందుకు ప‌నికి వ‌చ్చిన‌ట్లని షర్మిల ప్రశ్నించారు. 

Latest Videos

undefined

కాళేశ్వ‌రం ప్రాజెక్టు వాస్త‌వానికి ఒక అద్భుత‌మైన అబ‌ద్దం, మోసమన్నారు. ఇంత ఖ‌ర్చు పెడితే రెండేళ్ల‌కే కూలిపోయిందంటే కేసీఆర్ త‌ల‌కాయ ఎక్క‌డ పెట్టుకొంటారని ఆమె  అడిగారు.కాళేశ్వ‌రంలో జ‌రిగిన త‌ప్పున‌కు ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తారన్నారు. 

వైయ‌స్ఆర్  క‌ట్టిన దేవాదుల 18 ఏళ్లు అయినా చెక్కుచెద‌ర‌లేదన్నారు.  క‌న్నెప‌ల్లి కంటే ఎక్కువ నీళ్లు వ‌చ్చినా దేవాదుల నిల‌బ‌డిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. .దేవాదుల ప్రాజెక్టు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి స‌మ‌ర్థ‌త‌కు రుజువైతే, కాళేశ్వ‌రం కేసీఆర్ అస‌మ‌ర్థ‌త‌కు నిద‌ర్శనమన్నారు.

కాళేశ్వ‌రం ప‌నులు 80 శాతం మెగా కృష్ణారెడ్డి గారికే ఎందుకు అప్ప‌జెప్పారో చెప్పాలన్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అన్ని నాణ్య‌త లేని ప‌నులు చేసినందుకు మెగా కృష్ణారెడ్డి  మీద ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు? విచార‌ణ ఎందుకు జ‌ర‌ప‌డం లేదని షర్మిల ప్రశ్నించారు. ఈ న‌ష్టం ఎవ‌రు భ‌రించాలి?  రాష్ట్ర ప్ర‌జ‌లు ఎందుకు ఈ న‌ష్టాన్ని భ‌రించాలని ఆమె అడిగారు. ఈ నష్టాన్ని  మెఘా కృష్ణారెడ్డి భ‌రించాల్సిన న‌ష్టంగా షర్మిల అభిప్రాయపడ్డారు. 

మెగా కృష్ణారెడ్డిని ఎందుకు దోషిగా నిల‌బెట్ట‌డం లేదు. ఎందుకు ఆయ‌న నుంచి న‌ష్ట‌ప‌రిహారం వ‌సూలు చేయ‌డం లేదని అడిగారు. కేసీఆర్ ఎందుకు ప్ర‌తి ప్రాజెక్టు మెగా కృష్ణారెడ్డి గారికి ఇస్తున్నారో చెప్పాాలన్నారు. మెగా కృష్ణారెడ్డి  కేసీఆర్ మ‌నిషిగా ఆమె చెప్పారు. కేసీఆర్, మేఘా కృష్ణారెడ్డిలు  భాగ‌స్వాములుగా షర్మిల ఆరోపించారు.

మిష‌న్ భ‌గీర‌థ‌, మ‌న ఊరు మ‌న బ‌డి, రోడ్ల ప‌నులు, ఆర్టీసీ అన్నీ మెగా కృష్ణారెడ్డికే ఇస్తున్నారన్నారు.  ఒక రాష్ట్రంలో 80 శాతం ప‌నులు మెగా కృష్ణ‌రెడ్డి గారికే ఇస్తే ఏమిట‌ర్ధమన్నారు.తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఆంధ్రా వాళ్లు ప్రాజెక్టులు తీసుకుంటున్నార‌న్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు ఇంకా వాళ్ల‌కే ఎందుకు  ఇస్తున్నారని  చెప్పాలన్నారు. 

 తెలంగాణ‌లో ప్రాజెక్టులు చేసే వారు లేరా?  కొత్త వాళ్ల‌ను ప్రోత్స‌హించ‌రా? తెలంగాణ తెచ్చింది మెగా కృష్ణారెడ్డి కోస‌మేనా?అని షర్మిల అడిగారు.

కాంగ్రెస్ మాల్యాను, బీజేపీ అదానీని చేసిన‌ట్టు కేసీఆర్  మెగా కృష్ణారెడ్డిని ప్ర‌మోట్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. మెగా కృష్ణా రెడ్డి 12 వేల కోట్ల‌ జీఎస్టీ క‌ట్టాల్సి ఉంద‌ని స్వ‌యంగా జీఎస్టీ ఇంటిలిజెన్స్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ పేర్కొన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. మెగా కృష్ణారెడ్డి కి ఏ ప్రాజెక్టు ఇచ్చినా కేసీఆర్ కుటుంబానికి వాటా ఉంటుందని షర్మిల ఆరోపించారు.

మెగా కృష్ణారెడ్డికి ఎందుకు ప్రాజెక్టులు ఇస్తున్నారో తెలంగాణ‌లోని నిపుణులంతా ప్ర‌శ్నించాలి? రేవంత్‌రెడ్డి, బండి సంజ‌య్ ఎందుకు దీని గురించి మాట్లాడ‌డడం లేదన్నారు.. మెగా కృష్ణారెడ్డి మీద విచార‌ణ జ‌ర‌గాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 

also read:ఢిల్లీకి బయలుదేరిన కేసీఆర్: హస్తినలోనే రెండు రోజులు

మునుగోడులో ఎందుకు ఉప ఎన్నిక‌లు వస్తాయని అడిగారు..  స్వార్థం కోసం ఉప ఎన్నికలు తీసుకు వచ్చే వారికి జరిమానా విధించాలని ఆమె కోరారు. ఇష్టం వ‌చ్చిన‌ట్లు రాజీనామా చేయ‌డం,న‌చ్చిన పార్టీలోకి రావ‌డం వ‌ల్ల‌నే ఎన్నిక‌లు వ‌స్తున్నాయన్నారు. భ‌ద్రాచ‌లానికి క‌ర‌క‌ట్ట క‌ట్టి ఉంటే ఈ ప‌రిస్తితి వ‌చ్చేది కాదన్నారు.
వ‌ర‌ద‌ల‌కు పోల‌వ‌రం కార‌ణ‌మైతే ముందు దీని గురించి ఎందుకు మాట్లాడ‌లేదని ఆమె అడిగారు.   మీరు స్నేహితులై ఉండి ఎందుకు స‌మ‌స్య‌ ప‌రిష్క‌రించ‌లేదో చెప్పాలని కేసీఆర్ ను ప్రశ్నించారు.. 

 కేసీఆర్  క్లౌడ్ బ‌ర‌స్ట్ అంటూ మాట్లాడి త‌ప్పించుకోవ‌డానికి చూస్తున్నారన్నారు.  ఎవ‌రు చేసుకున్న స‌ర్వేలో వాళ్ల‌కు అనుకూలంగా రిపోర్టు వ‌స్తుందన్నారు.ఈ స‌ర్వేల‌ను సీరియ‌స్‌గా తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదన్నారు. వచ్చే నెల 3 లేదా 4వ తేదీ నుంచి మ‌ళ్లీ పాద‌యాత్ర‌ ప్రారంభిస్తామని ఆమె చెప్పారు.

click me!