కేసీఆర్, విజయశాంతిలు తెలంగాణ వాళ్లా: స్థానికతపై విమర్శలకు షర్మిల కౌంటర్

By Siva KodatiFirst Published Feb 24, 2021, 7:46 PM IST
Highlights

పార్టీ ఏర్పాటులో భాగంగా తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన వైఎస్సార్ అభిమానులతో షర్మిల గత కొన్ని రోజులుగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే

పార్టీ ఏర్పాటులో భాగంగా తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన వైఎస్సార్ అభిమానులతో షర్మిల గత కొన్ని రోజులుగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

బుధవారం చిట్ చాట్‌లో భాగంగా షర్మిల మాట్లాడుతూ.. తన స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని ఆమె స్పష్టం చేశారు. విజయశాంతి, కేసీఆర్ ఇక్కడి వాళ్లేనా అని షర్మిల ప్రశ్నించారు.

జయలలిత కూడా తమిళనాడు వాసి కాదని.. తాను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనేనని ఆమె వెల్లడించారు. పార్టీ వేరు, ప్రాంతం వేరైనా, అన్నాచెల్లెళ్లుగా తామంతా ఒక్కటేనని షర్మిల పేర్కొన్నారు.

Also Read:షర్మిల పార్టీలో తొలి నియామకం.. అతనెవరంటే....

దేవుడి దయతో తెలంగాణ వచ్చిందని.. తెలంగాణ వచ్చాక ప్రజల సమస్యలు తీరాయా అని షర్మిల ప్రశ్నించారు. అమరవీరుల ఆశయాలు నెరవేరాయా అని ఆమె నిలదీశారు.

తెలంగాణ ఉద్యమంలో తాను లేనంత మాత్రాన, తెలంగాణపై ప్రేమ ఉండదని షర్మిల ప్రశ్నించారు. అమరవీరుల త్యాగాలు స్మరిస్తూ వాళ్ల గడపకు వెళ్లి వస్తానని ఆమె స్పష్టం చేశారు. 

పార్టీ పెట్టడం మా అన్నకు ఇష్టం లేదని.. కానీ మా అనుబంధాల్లో తేడాలుండవని షర్మిల స్పష్టం చేశారు. మాటలు, అనుబంధాలు, రాఖీలుంటాయని విబేధాలో, భిన్నాభిప్రాయాలో తనకు తెలియదన్నారు. నాకు పదవి ఎందుకు ఇవ్వలేదో జగన్‌నే అడగాలని షర్మిల సూచించారు. 

click me!