గోముఖ వ్యాఘ్రంలా సీఎం ప్రవర్తన: కేసీఆర్‌పై విజ‌య‌శాంతి విమ‌ర్శ‌లు

Siva Kodati |  
Published : Jul 08, 2021, 03:50 PM IST
గోముఖ వ్యాఘ్రంలా సీఎం ప్రవర్తన: కేసీఆర్‌పై విజ‌య‌శాంతి విమ‌ర్శ‌లు

సారాంశం

గోవధ నిషేధ చట్టానికి తెలంగాణ సీఎం కేసీఆర్ శఠగోపం పెడుతున్నారని బీజేపీ నేత విజయశాంతి విమర్శించారు.  రాష్ట్రంలో గోవుల అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది ఆమె ఆరోపించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు బీజేపీ నాయకురాలు విజయశాంతి. హైందవ ధర్మ పరిరక్షణ విషయంలో కేసీఆర్ గోముఖ వ్యాఘ్రంలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. నికార్సైన హిందువునని చెప్పుకుంటూ హైందవ ధర్మానికే కళంకం తెచ్చేలా వ్యవహరిస్తున్నారు' అని విజ‌య‌శాంతి ఆరోపించారు.

‘‘ హైందవ ధర్మ పరిరక్షణ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ గారు గోముఖ వ్యాఘ్రంలా ప్రవర్తిస్తున్నారు. నికార్సైన హిందువునని చెప్పుకుంటూ హైందవ ధర్మానికే కళంకం తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. చట్టాలను కాపాడవలసిన రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి... గోవధ నిషేధ చట్టానికి శఠగోపం పెడుతున్నారు. లోక్‌సభ, శాసనసభ సభ్యులుగా మీ సయామీ ట్విన్ పార్టీ ఎంఐఎం నేతలు చట్ట విరుద్ధంగా బక్రీద్ రోజున గోవధ చేస్తామంటూ డీజీపీకి వినతి పత్రం ఇస్తే మీరు చూస్తూ ఊరుకున్నారు తప్ప చేస్తున్నదేమీ లేదు.

అసలు ఇలాంటి వినతి పత్రం ఇచ్చినందుకు ఆ పార్టీ నేతలను రాజ్యాంగబద్ధమైన పదవుల నుంచి తప్పించాలి. అక్రమంగా గోవుల రవాణాను నిరోధించి, గోవధ జరగకుండా అడ్డుకుని రక్షించడానికి రాజ్యాంగంలోని జంతు సంరక్షణ చట్టాల ప్రకారం సుప్రీంకోర్టు వివిధ సందర్భాలలో పలు తీర్పులు ఇచ్చింది. అత్యున్నత న్యాయస్థానం తీర్పులను అనుసరించడం మాట అటుంచితే, రాష్ట్రంలో గోవుల అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. చట్టాలకు అనుగుణంగా గోవులను రక్షిస్తున్నవారిపైన తెలంగాణలో దాడులు జరుగుతున్నాయి. ఈ పరిణామాలపై తగిన చర్యలు తీసుకుని గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత పూర్తిగా సర్కారుదే. కాదంటే, హిందూ సమాజపు ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదు.

 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan అంటే భయమా? | Janasena Leader Shankar Goud fire on Jagadeesh Reddy | Asianet News Telugu
Holidays : ఈ వీక్ లో ఇంకా ఒక్కటే వర్కింగ్ డే.. మిగతా వారమంతా సెలవులే.. నెక్ట్స్ మండే వరకు ఎంజాయ్