జగన్ అక్రమాస్తుల కేసు: జగతి పబ్లికేషన్ విజ్ఞప్తికి హైకోర్టు ఆమోదం

By telugu teamFirst Published Nov 25, 2020, 2:04 PM IST
Highlights

ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో జగతి పబ్లికేషన్ విజ్ఞప్తిని తెలంగాణ హైకోర్టు ఆమోదించింది. నాంపల్లి కోర్టులో ఉన్న ఒక్క చార్జిషీట్ ను కూడా సీబిఐ కోర్టుకు బదిలీ చేయాలని జగతి కోరింది.

హైదరాబాద్: ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో ఉన్న ఒక్క ఈడీ చార్జిషీట్ ను కూడా సీబీఐ కోర్టుకే బదిలీ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. జగన్ అక్రమాస్తుల కేసులపై సీబీఐ చార్జిషీట్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నాంపల్లి మెంట్ సీబీఐ కోర్టులో ఆరు చార్జిషీట్లు, నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో ఒక్క చార్జిషీట్ దాఖలు చేసింది. 

సీబిఐ కోర్టులో ప్రధాన కేసులు పెండింగులో ఉన్నందు వల్ల నాంపల్లి కోరటులో పెండింగులో ఉన్న అరబిందో, హెటిరో భూకేటాయింపులకు సంబంధించిన ఈడీ కేసును కూడా అక్కడికే బదిలీ చేయాలని జగతని పబ్లికేషన్స్ కోరింది. 

అందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. దాంతో జగతి పబ్లికేషన్స్ హైకోర్టును ఆశ్రయించింది. దానిపై హైకోర్టులో విచారణ జరిపింది. అన్ని చార్జిషీట్లపై ఒకే కోర్టులో విచారణ జరిపే విధంగా అరబిందో, హిటిరో ఈడీ కేసును కూడా సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. 

ఈ నెల 30వ తేదీన నాంపల్లి కోర్టులో విచారణ ఉంది. దాంతో ఆ రోజు బదిలీ ప్రక్రియ పూర్తి అవుతుందని భావిస్తున్నారు. 

click me!