‘నన్ను పెళ్లి చేసుకో.. లేదంటే చంపేస్తా...’ వివాహితకు యూ ట్యూబ్ ఛానల్ నిర్వాహకుడి బ్లాక్ మెయిల్..

Published : Sep 08, 2021, 11:55 AM IST
‘నన్ను పెళ్లి చేసుకో.. లేదంటే చంపేస్తా...’ వివాహితకు యూ ట్యూబ్ ఛానల్ నిర్వాహకుడి బ్లాక్ మెయిల్..

సారాంశం

భాగస్వామిగా ఉన్న వివాహితను పెళ్లి పేరుతో వేధింపులకు గురి చేశాడు. అనంతరం చేతులు కోసుకుని చనిపోతానంటూ బెదిరించాడు. బాధితురాలు జూన్ 26న జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

హైదరాబాద్ : వివాహితను పెళ్ల చేసుకోవాలంటూ బెదిరించిన ఘటనలో యూ ట్యూబ్ ఛానల్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జవహర్ నగర్ ఇన్స్ పెక్టర్ భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్ నగర్ కాలనీకి చెందిన అరుణ్ కుమార్ త్యాగి (47) స్థానికంగా యూ ట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. 

అందులో భాగస్వామిగా ఉన్న వివాహితను పెళ్లి పేరుతో వేధింపులకు గురి చేశాడు. అనంతరం చేతులు కోసుకుని చనిపోతానంటూ బెదిరించాడు. బాధితురాలు జూన్ 26న జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకి పంపారు. అనంతరం జులై 28న బెయిల్ మీద బయటికి వచ్చిన నిందితుడు తిరిగి ఆమెను వేదించడం మొదలు పెట్టాడు. 

కేసును వెనక్కి తీసుకోవాలని, తనని వివాహం చేసుకోవాలని.. లేదంటే చంపేస్తానంటూ బాధితురానికి బెదిరించాడు. మరో మహిళకు సైతం ఫోన్ లో అసభ్య సందేశాలను పంపిస్తూ వేధిస్తున్నాడు. దీంతో ఇరువురి ఫిర్యాదుతో పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Brahmanandam Spech: వెంకయ్య నాయుడుపై బ్రహ్మానందం పంచ్ లు | Asianet News Telugu
Venkaiah Naidu Attends Sankranti: ఈ చిన్నారి రికార్డ్ చూసి వెంకయ్య నాయుడు షాక్| Asianet News Telugu