కేసీఆర్ కాన్వాయ్ కి అడ్డం పడ్డ యువకుడు, కారణం ఏమిటంటే....

By Sree sFirst Published Jun 2, 2020, 1:46 PM IST
Highlights

నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించేందుకు బయల్దేరారు. అలా కేసీఆర్ తన కాన్వాయ్ లో వెళుతుండగా మార్గమధ్యంలో ఒక యువకుడు అనూహ్యంగా కేసీఆర్ కాన్వాయ్ కి అడ్డు తగిలాడు. 

నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించేందుకు బయల్దేరారు. అలా కేసీఆర్ తన కాన్వాయ్ లో వెళుతుండగా మార్గమధ్యంలో ఒక యువకుడు అనూహ్యంగా కేసీఆర్ కాన్వాయ్ కి అడ్డు తగిలాడు. 

అంత మంది భద్రత సిబ్బంది, పోలీసుల పహారా మధ్య ఆ యువకుడు కేసీఆర్ కారు డోర్ వద్ద వరకు వెళ్ళాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నల్గొండ జిల్లా కొండమల్లేపల్లికి చెందిన హనుమంతు నాయక్ గా గుర్తించారు. 

తనకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు కోసం కేసీఆర్ కాన్వాయ్ కి అడ్డుతగిలాదని పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. ఈ హఠాత్ పరిణామంతో ఒక్కసారిగా భద్రతాసిబ్బంది అవాక్కయ్యారు. 

తెలంగాణ ప్రత్యేక  రాష్ట్రంగా ఏర్పడి నేటికీ 6ఏండ్లు. అనూహ్యంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడే మన గవర్నర్ తమిళిసై గారి జన్మదినం కూడా.  

ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసైకి సీఎం కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఆయురారోగ్యాలతో సంపూర్ణ జీవితం గడపాలని కేసీఆర్ ఆకాంక్షించారు.  రాజ్ భవన్ కి  పుష్పగుచ్చంతో పాటుగా పండ్ల బుట్టను కూడా ఇచ్చారు కేసీఆర్. 

గవర్నర్ మాట్లాడుతూ... తన పుట్టినరోజు, రాష్ట్ర అవతరణ దినోత్సవం.. ఒకే రోజు కావడం ఆనందంగా ఉందని, భారత స్వతంత్ర పోరాటం తర్వాత సుదీర్ఘకాలం జరిగిన ఉద్యమంగా... తెలంగాణ ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు తమిళిసై. 

ఇక కేసీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ....  తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణాలు త్యాగంచేశారని, ఆత్యాగఫలమే నేడు మనం అనుభవిస్తున్న తెలంగాణ అని అన్నారు కేసీఆర్. 

ఇకపోతే... తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. ముఖ్యంగా ప్రభుత్వం కార్యలయాలు, అధికార టీఆర్ఎస్ కార్యాలయాల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకుంటున్నారు. ఇలా కరీంనగర్ తీగల గుట్టపల్లి ప్రాంతంలోని తెలంగాణ భవన్ లో  మంత్రి గంగుల కమలాకర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో కూడా మంత్రి  గంగుల జెండా ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తెలంగాణ గడ్డమీద  కేసీఆర్ పుట్టడం తెలంగాణ ప్రజల అదృష్టమన్నారు. కేసీఆర్ పుట్టిన గడ్డమీదే తాను కూడా పుట్టడం తన అదృష్టమని మంత్రి వెల్లడించారు. 

''ఆరు సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో అద్భుత ఫలితాలు వచ్చాయి. కేసీఆర్ తెలంగాణ ఆస్తి...తెలంగాణ ప్రజల ధైర్యం ,దైవం..కేసీఆర్ హయాంలో దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. వ్యవసాయంలో అద్భుత ప్రగతి సాధించాం'' అని తెలిపారు. 

 

click me!