ప్రేమ వ్యవహారం.. చంపి భూమిలో పాతిపెట్టారు

Published : Apr 04, 2019, 09:37 AM ISTUpdated : Apr 04, 2019, 10:19 AM IST
ప్రేమ వ్యవహారం.. చంపి భూమిలో పాతిపెట్టారు

సారాంశం

ప్రేమ వ్యవహారం కారణంగా ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. యువకుడిని హత్య చేసి భూమిలో పాతిపెట్టారు. 


ప్రేమ వ్యవహారం కారణంగా ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. యువకుడిని హత్య చేసి భూమిలో పాతిపెట్టారు. ఈ సంఘటన జనగామ జిల్లా చిలుపూర్‌ మండలం ఫత్తేపూర్‌ శివారు బోడబండ తండా సమీపంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌ మండలం చిన్నరాతిపల్లికి చెందిన అరుణ్‌కుమార్‌కు పెళ్ళికి ముందే సిద్దిపేట జిల్లా కట్కూరుకు చెందిన ఓ అమ్మాయితో పరిచయం ఉంది.

ఆమె తల్లిదండ్రులు ఫత్తేపూర్‌కు చెందిన రవికుమార్‌తో కొద్దిరోజుల కిందట వివాహం నిశ్చయించారు. దీంతో అరుణ్‌, రవికుమార్‌కు ఫోన్‌ చేసి ఆమెను పెళ్ళి చేసుకుంటే చంపుతానని బెదిరించాడు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు గత నెల 29న అరుణ్‌కుమార్‌ను వ్యాన్‌లో ఎక్కించుకుని ఫత్తేపూర్‌కు బయలుదేరారు. 

బోడబండ తండా సమీపంలో అరుణ్‌కుమార్‌ వ్యాన్‌లో నుంచి దూకి పారిపోతుండగా అమ్మాయి తరపు బంధువులు కొట్టి చంపి, శవాన్ని పాతిపెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా బుధవారం అరుణ్‌కుమార్‌ మృతదేహం ఆచూకీ లభ్యమైంది.

PREV
click me!

Recommended Stories

Telangana : తెలంగాణలో అతిపెద్ద జిల్లా ఏది? అత్యంత చిన్నది ఏది?
పిడుగులు, ఈదురుగాలుల జాగ్రత్త.. ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్ | Asianet News Telugu