
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో నలుగురు తిరిగే చోట అసభ్య చేష్టలతో మునిగిన ప్రేమ జంటను ప్రశ్నించినందుకు అతన్ని మరణం పలకరించింది. పార్టీ చేసుకుంటుంటే అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ జంటను చూసి వారించబోతే అతనిపై ప్రియుడు దాడి చేశాడు.
ఆ దాడిలో యువకుడు సాయి సాగర్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌లో కొందరు యువకులు బర్త్‌డే పార్టీ చేసుకునేందుకు వచ్చారు. అక్కడే ఓ ప్రేమజంట అసభ్యంగా ప్రవర్తించడాన్ని చూసిన సాయి సాగర్ అనే యువకుడు వారిని వారించాడు.
దీంతో రెచ్చిపోయిన యువతి ప్రియుడు మొబిన్ సాయి సాగర్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో సాగర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సాయి సాగర్ స్నేహితుల ఫిర్యాదు మేరకు రాంగోపాల్‌పేట పోలీసులు మొబిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అతనిపై 16 కేసులున్నట్టు పోలీసులు గుర్తించారు.