స్మశానంలో అర్థరాత్రి చిందులు.. డీజేలు పెట్టి హిజ్రాలతో డ్యాన్సులు...

Published : Jun 14, 2021, 12:11 PM IST
స్మశానంలో అర్థరాత్రి చిందులు.. డీజేలు పెట్టి హిజ్రాలతో డ్యాన్సులు...

సారాంశం

అర్థరాత్రి డీజేలు పెట్టి హిజ్రాలతో చిందులేసిన వారిపై హబీబ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని హబీబ్ నగర్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సుబాన్ పురా దర్గా షా ఖామూష్ లో ఉండే ఆమీర్ సోదరి వివాహం శనివారం ఉదయం ఉండడంతో శుక్రవారం రాత్రి మెహిందీ వేడుకలు ఏర్పాటు చేశారు. 

ఈ క్రమంలో దర్గా షాలోని శ్మశాన వాటికలో అర్థరాత్రి 11.30గంటల సమయంలో డీజేలు పెట్టి పెద్ద సంఖ్యలో యువకులు చిందులేశారు. అదే సమయంలో అటుగా వెల్తున్న ఇద్దరు హిజ్రాలను పిలిచి వారితో కలిసి రాత్రంతా డ్యాన్స్ చేస్తూ వీడియోలు తీసుకున్నారు. 

ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లాయి. డీజే సామాగ్రిని స్వాధీనం చేసుకుని, ఐదుగురిపై కేసులు నమోదు చేసినట్లు ఇన్ స్పెక్టర్ నరేందర్‌ తెలిపారు. మాన్గార్ బస్తీలో కత్తులతో జన్మదిన వేడుకలు చేసుకున్న ఘటనలో తొమ్మిదిమంది జైలుకెళ్లి ఒకరోజు కూడా గడవక ముందే మరో దగ్గర వేడుక పేరుతో అర్థరాత్రి యువకులు చిందులేయడం చర్చనీయాంశంగా మారింది.
 
PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం