అత్తగారింటి వేధింపులు... యువకుడి ఆత్మహత్య

Published : Aug 07, 2020, 12:08 PM IST
అత్తగారింటి వేధింపులు... యువకుడి ఆత్మహత్య

సారాంశం

ఆ సమయంలో సింగరేణిలో ఉద్యోగం పెట్టిస్తామని అమ్మాయి కుటుంబం చెప్పింది. ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగం పెట్టించలేదు. పైగా అత్తగారింట్లో ఎవరూ మర్యాద ఇవ్వకపోవడంతో అమల, దినేష్‌ మధ్య తగాదాలు మొదలయ్యాయి.

అత్తగారింటి వేధింపులు తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంచిర్యాలలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

కాగజ్‌నగర్‌కు చెందిన ఇగురపు చంద్రయ్య, సుందరి దంపతుల కుమారుడు దినేష్‌ (29)కు మూడేళ్ల క్రితం జైపూర్‌ మండలం ఇందారానికి చెందిన అమలతో పెళ్లయ్యింది. ఆ సమయంలో సింగరేణిలో ఉద్యోగం పెట్టిస్తామని అమ్మాయి కుటుంబం చెప్పింది. ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగం పెట్టించలేదు. పైగా అత్తగారింట్లో ఎవరూ మర్యాద ఇవ్వకపోవడంతో అమల, దినేష్‌ మధ్య తగాదాలు మొదలయ్యాయి.

దినేష్‌ సీసీసీలోని షిర్కే క్వార్టర్స్‌లో ఉంటూ జైపూర్‌ పవర్‌ప్లాంట్‌లో కాంట్రాక్టర్‌ వద్ద స్కిల్డ్‌వెల్డర్‌గా పని చేస్తున్నాడు. వారం క్రితం అమల దినేష్‌తో గొడువ పడి పుట్టింటికి వెళ్లిపోయింది. గురువారం దినేష్‌ రైలుపట్టాలపై మృతి చెంది ఉన్నాడు. దినేష్‌ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, దినేష్‌ మృతికి ఆయన భార్య, అత్తమామలే కారణమని మృతుడి కుటుంబం ఆరోపిస్తోంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్‌పీ పోలీసులు తెలిపారు.  

PREV
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!