మహిళ స్నానం చేస్తుండగా.. ఫోన్ లో వీడియో తీసి..

Published : Jan 03, 2019, 09:50 AM IST
మహిళ స్నానం చేస్తుండగా.. ఫోన్ లో వీడియో తీసి..

సారాంశం

తాగిన మైకంలో ఓ యువకుడు మహిళ స్నానం చేస్తుండగా.. ఫోన్ లో వీడియో తీశాడు. 

తాగిన మైకంలో ఓ యువకుడు మహిళ స్నానం చేస్తుండగా.. ఫోన్ లో వీడియో తీశాడు. కాగా అతనికి స్థానికులు దేహశుద్ధి చేసిన సంఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొత్తూరు గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. 

స్థానికుల కథనం ప్రకారం.. సంగెం మండలంలోని తీగరాజుపెల్లి గ్రామానికి చెందిన కుమార్‌.. కొత్తూరులో తన బంధువు అంత్యక్రియలకు వచ్చాడు. అతిగా మద్యం సేవించాడు. ఓ వైపు అంతిమయాత్ర జరుగుతుండగానే, తాగిన మైకంలో ఉన్న అతడు ఓ ఇంటి వద్ద మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీయబోయాడు.

 అది గమనించిన స్థానికులు, మహిళలు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో తాను ఓ టీవీ చానెల్‌ రిపోర్టర్‌గా పని చేస్తున్నానని చెప్పినట్లు స్థానికులు తెలిపారు. కాగా... ఇదే యువకుడు ఇటీవల సంగెం మండలంలో మద్యం షాపులో కూడా గొడవపడగా, పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu