టీచర్ కి వేధింపులు.. ఆకతాయికి దేహశుద్ధి

By telugu teamFirst Published 27, Jun 2019, 7:46 AM IST
Highlights

ప్రైవేటు స్కూల్ టీచర్ ని లైంగికంగా వేధించిన ఓ ఆకతాయికి స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం అతనిని పోలీసులకు అప్పగించారు.

ప్రైవేటు స్కూల్ టీచర్ ని లైంగికంగా వేధించిన ఓ ఆకతాయికి స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం అతనిని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో  చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఉప్పర్ పల్లి ప్రాంతానికి చెందిన యాకూబ్(30) న్యూ ఫ్రెండ్స్ కాలనీకి చెందిన ఓ ప్రైవేటు టీచర్ ని కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. ఆమె స్కూల్ కి వెళ్లి తిరిగి వచ్చే సమయంలో ఆమె వెంట పడుతూ అసభ్యంగా కామెంట్స్ చేసేవాడు. రోజు రోజుకు యాకూబ్‌ ప్రవర్తన శృతిమించుతుండడంతో విషయాన్ని టీచర్‌ తన భర్తకు తెలిపింది.

 బుధవారం ఉదయం టీచర్‌ స్కూల్‌కు కాలినడకన వెళ్తుండగా న్యూ ఫ్రెండ్స్‌ కాలనీ వద్ద యాకూబ్‌ ఆమె చున్నీ పట్టుకొని లాగాడు. దీంతో టీచర్‌ భర్తతో పాటు స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి రాజేంద్రనగర్‌ పోలీసులకు అప్పగించారు.

Last Updated 27, Jun 2019, 7:46 AM IST