టిక్కెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలి: కాంగ్రెస్‌ను కోరుతున్న మహిళా, యూత్ విభాగాలు

By narsimha lode  |  First Published Oct 8, 2023, 1:03 PM IST


టిక్కెట్ల కేటాయింపు విషయంలో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని  కాంగ్రెస్ నాయకత్వానికి  పలు విభాగాల నేతలు  కోరుతున్నారు.



హైదరాబాద్:టిక్కెట్ల కేటాయింపుపై తమకు ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీలోని  పలు విభాగాల నేతలు  కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుతున్నారు. 

కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం  ఇవాళ  జరుగుతుంది.  ఇప్పటికే  సుమారు  70 మంది అభ్యర్థుల జాబితాలను కాంగ్రెస్ నాయకత్వం  వడపోసింది.  మరోవైపు ఒకే అభ్యర్థి ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఖరారు చేసింది. ఇవాళ  స్క్రీనింగ్ కమిటీలో  అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేయనున్నారు. మరో వారంలో  అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని కాంగ్రెస్ భావిస్తుంది.  కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి  రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ  వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే,  రోహిత్ చౌదరి , రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క,  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు  సమావేశమయ్యారు.

Latest Videos

టిక్కెట్ల కేటాయింపు విషయంలో  బీసీ సామాజిక వర్గానికి  చెందిన నేతలకు  48 అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించాలని  ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు  కోరుతున్నారు. అయితే  ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రెండు అసెంబ్లీ స్థానాలను  కేటాయించేందుకు కాంగ్రెస్ నాయకత్వం  సానుకూలంగా ఉంది.  అయితే  48 అసెంబ్లీ సీట్ల కోసం బీసీ  సామాజిక వర్గం నేతలు కోరుతున్నారు. గత మాసంలో ఈ విషయమై బీసీ సామాజిక వర్గం నేతలు ఢిల్లీలో  కాంగ్రెస్ అగ్రనేతలను  కలిశారు. 

also read:ఈ నెల 15 నుండి తెలంగాణ కాంగ్రెస్ బస్సు యాత్ర: ప్రియాంక, రాహుల్ పాల్గొనేలా ప్లాన్

ఐదు సీట్లను యూత్ కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. ఇదే విషయాన్ని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ  చైర్మెన్ మురళీధర్ ను కోరారు. రెండు రోజుల క్రితం  మురళీధరన్ తో  కోమటిరెడ్డి భేటీ అయిన విషయం తెలిసిందే.   కమ్మ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు రెండు రోజుల క్రితం  న్యూఢిల్లీలోని  కాంగ్రెస్ అగ్రనేతలను కలిశారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన  నేతలకు కనీసం 10 అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించాలని  కోరుతున్నారు. పార్టీలోని ఆయా విభాగాల నేతలు  తమ విభాగాలకు  టిక్కెట్లు కేటాయించాలని కోరడంతో  టిక్కెట్ల కేటాయింపు విషయమై ఆయా విభాగాలకు ప్రాధాన్యత విషయమై పార్టీ నాయకత్వం  ఫోకస్ చేస్తుంది. అదే సమయంలో ఇతర పార్టీల నుండి వచ్చిన నేతలకు  కూడ  టిక్కెట్ల కేటాయింపుపై  కేంద్రీకరించనుంది.

click me!