ప్రియున్ని చితకబాది... యువతిని ఎత్తుకెళ్ళి అత్యాచారం, వీడియో తీస్తూ...

Arun Kumar P   | Asianet News
Published : Apr 04, 2021, 08:43 AM IST
ప్రియున్ని చితకబాది... యువతిని ఎత్తుకెళ్ళి అత్యాచారం, వీడియో తీస్తూ...

సారాంశం

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని పర్యాటక ప్రదేశం బ్లాక్‌బెర్రీ ఐలాండ్‌ అటవీ ప్రాంతంలో ఓ యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడటమే కాదు సెల్ ఫోన్లో వీడియోలు చిత్రీకరించారు.   

ములుగు: పచ్చటి అటవీ ప్రాంతం అందాలను చూడటానికి ప్రియుడితో కలిసి వెళ్లిన ఓ యువతి కామాంధుల చేతుల్లో నలిగిపోయింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని పర్యాటక ప్రదేశం బ్లాక్‌బెర్రీ ఐలాండ్‌ అటవీ ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రియుడిని చితకబాది యువతిపై అత్యాచారానికి పాల్పడటమే కాదు సెల్ ఫోన్లో వీడియోలు చిత్రీకరించారు. 

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఓ ప్రేమ జంట సరదాగా గడపడానికి తాడ్వాయి సమీపంలోని పర్యాటక ప్రాంతం బ్లాక్ బెర్రీ ఐలాండ్ కు బైక్ పై వెళ్లారు. అయితే వారు అటవీప్రాంతంలోకి వెళ్లడాన్ని గమనించిన బొట్టాయిగూడెంకు చెందిన సాత్విక్, ఆనందరావు లు వెంబడించారు. నిర్మానుష్య ప్రాంతంలో ఈ ప్రేమజంటను అడ్డుకున్న ఈ ఇద్దరు యువకుడిని చితకబాది బైక్ టైర్లో గాలి తీసేశారు.  

అనంతరం యువతిని బెదిరించి తమ బైక్ పై ఎక్కించుకుని మణుగూరు వైపు తీసుకెళ్లారు. ఓ ప్రాంతంలో బైక్ ఆపి యువతిపై సాత్విక్ అత్యాచారానికి పాల్పడగా ఆనందరావు  వీడియో తీశాడు. ఇలా ఇద్దరు పలుమార్లు యువతిపై అత్యంత దారుణంగా అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ లైంగికదాడి వల్ల యువతికి తీవ్ర రక్తస్రావం అయ్యింది. దీంతో కాస్త భయపడిన యువకులు ఆమెను తిరిగి బైక్ పై ఎక్కించుకుని స్వగ్రామంలో వదిలిపెట్టారు. 

అత్యాచారం జరిగినట్లు ఎవరికైనా చెబితే వీడియో సోషల్ మీడియాలో పెడతామంటూ యువతిని బెదిరించారు. అయితే ఈ బెదిరింపులకు భయపడని యువతి ఓ స్నేహితుడి సాయంతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు  చేసుకున్న పోలీసులు నిందితులిద్దరినీ కాటాపూర్‌ క్రాస్‌ వద్ద అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. 
 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu