
హైదరాబాద్‌లో (hyderabad metro) దారుణం జరిగింది. అమీర్‌పేట మెట్రో స్టేషన్ (ameerpeta metro station) రెండో అంతస్తు నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు (suicide attempt) యత్నించింది. శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో సదరు యువతి మెట్రో స్టేషన్ రెండో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు యత్నించి .. పక్కనే ఉన్న టింబర్ డిపోలో పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన మెట్రో సిబ్బంది 108 వాహనంలో ఆమెను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని యువతికి సంబంధించిన వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.