శంషాబాద్‌లో విషాదం...ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి

Published : Dec 23, 2018, 04:46 PM IST
శంషాబాద్‌లో విషాదం...ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి

సారాంశం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని కొత్వాల్ గూడ లో విషాదం చోటుచేసుకుంది.ఆదివారం సెలవురోజు రావడంతో సరదాగా గడపడానికి గ్రామ సమీపంలోని ఓ క్వారీ గుంతలో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు వున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

గ్రామానికి చెందిన ఐదుగురు స్నేహితులు సరదాగా ఈతకొట్టడానికని మానవహిల్స్  క్వారీ గుంత వద్దకు వెళ్లారు. అయితే ఇందులో ముగ్గురు యువకులు ఈత కొట్టడానికి నీళ్లలో దిగి మునిగిపోయారు. ఈ దుర్ఘటనలో మృతిచెందిన యువకులు భార్గవ్,  సూర్య, చంద్ర లుగా గుర్తించారు. భార్గవ్, సూర్యలు సొంత అన్నదమ్ముళ్లు. 

ఈ  ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో ఇద్దరు యువకుల మృతదేహాలను బయటకు తీశారు. మరో మృతదేహం కోసం క్వారీ గుంతలో గాలింపు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇక‌పై గోవా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో 35 ఎకరాల్లో, రూ. 350 కోట్లతో అద్భుత నిర్మాణం
Hyderabad Vegetable Price : ఈ వీకెండ్ మార్కెట్స్ లో కూరగాయల ధరలు ఎలా ఉంటాయంటే..