మళ్లీ నిరసన బాట పట్టిన మల్లన్నసాగర్ నిర్వాసితులు (వీడియో)

By narsimha lodeFirst Published Feb 3, 2019, 5:16 PM IST
Highlights

మల్లన్నసాగర్  ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు మళ్లీ ఆందోళనబాటపట్టాయి.  ఒకే ప్రాజెక్టు కింద పరిహారం చెల్లింపులో  ఒక్కో గ్రామానికి ఒక్కో రకంగా  చెల్లిస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సిద్దిపేట: మల్లన్నసాగర్  ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు మళ్లీ ఆందోళనబాటపట్టాయి.  ఒకే ప్రాజెక్టు కింద పరిహారం చెల్లింపులో  ఒక్కో గ్రామానికి ఒక్కో రకంగా  చెల్లిస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వాసితులు ఆందోళన బాట పట్టారు.

సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు ఆదివారం నాడు ఆందోళన బాట పట్టారు. ముంపు గ్రామాల నిర్వాసితులకు ఒకే రకంగా పరిహారం చెల్లించడం లేదని  ఎర్రవల్లి గ్రామస్థులు నిరసనకు శ్రీకారం చుట్టారు."

తక్కువ ధరకే తాము భూములను కోల్పోయామని ఎర్రవల్లి గ్రామస్తులు  సాగర్ ఆయకట్టుపై వంటా వార్పును చేపట్టారు. కేసీఆర్ నేర్పిన ఉద్యమ బాటలోనే  న్యాయపోరాటానికి దిగామని ఆందోళన కారులు చెబుతున్నారు. న్యాయం జరిగే వరకు తాము ఉద్యమాన్ని చేపడుతామన్నారు.  ఉద్యమాన్ని ఆపకుండా శాంతియుతంగా నిరసనలు కొనసాగిస్తున్నారు.

click me!