రూ.40కోట్ల విలువచేసే వెండి పట్టివేత

Published : Jun 10, 2019, 10:31 AM IST
రూ.40కోట్ల విలువచేసే వెండి పట్టివేత

సారాంశం

రూ.40కోట్లు విలువచేసే వెండిని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. బోయిన్ పల్లిలో భారీగా తరలిస్తున్న వెండిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

రూ.40కోట్లు విలువచేసే వెండిని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. బోయిన్ పల్లిలో భారీగా తరలిస్తున్న వెండిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధి డెయిరీ ఫాం రోడ్డులో పోలీసుల తనిఖీలు జరుపుతుండగా రెండు కంటెయినర్లలో పది టన్నుల వెండి కడ్డీలు పట్టుబడ్డాయి. 

వీటి విలువ సుమారు రూ.40 కోట్లు ఉంటుందని పోలీసుల అంచనా వేస్తున్నారు. తొలుత ఈ వెండి లండన్ నుంచి చెన్నైకు తరలించారని అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?