గత బీఆర్ఎస్ ప్రభుత్వం నెలలో మొదటి వారంలో కూడా జీతాలు ఇవ్వలేదని, కానీ తాము నెల మొదటి తేదీనే జీతాలు ఇస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మర్చి 12వ తేదీన మహిళలకు వడ్డీ లేని రుణాల పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు.
గత ప్రభుత్వం గుట్టలు, కొండలకు కూడా రైతుబంధును ఇచ్చిందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కానీ వాటికి ఇవ్వకూడదని నిర్ణయించుకుందని తెలిపారు. ఐదు నెలల పాటు రైతుబంధును గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని, కానీ తాము దాని కంటే తక్కువ టైమ్ లోనే రైతులకు అందిస్తున్నామని చెప్పారు.
ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారమే తాము రైతుబంధు ఇస్తున్నామని అన్నారు. తెలంగాణలో ఉన్న ప్రతీ మహిళను తాము మహాలక్ష్మీగానే భావించి గౌరవిస్తున్నామని భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నికలకు ముందు తాము ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు.
Hon’ble Deputy CM Sri.Mallu Batti Vikramarka will address the media https://t.co/cOf7tpYg3W
— Telangana Congress (@INCTelangana)గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్వయం సహాయక బృందాలను నిర్వీర్యం చేసిందని డిప్యూటీ సీఎం ఆరోపించారు. మార్చి 12వ తేదీన మహిళా సంఘాలకు వడ్డీలేని లోన్లు ఇచ్చే స్కీమ్ ను ప్రారంభిస్తామని వెల్లడించారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పడానికి మహిళలందరికీ అవకాశం కల్పిస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 1వ తేదీన జీతాలు వేస్తోందని అన్నారు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి వారంలో కూడా ఇవ్వలేదని విమర్శించారు.