హైదరాబాద్‌లోని బన్సీలాల్‌పేటలో విషాదం.. పిల్లలను బిల్డింగ్ పైనుంచి తోసేసి తల్లి ఆత్మహత్య..

Published : Jun 19, 2023, 03:42 PM ISTUpdated : Jun 19, 2023, 04:16 PM IST
హైదరాబాద్‌లోని బన్సీలాల్‌పేటలో విషాదం.. పిల్లలను బిల్డింగ్ పైనుంచి తోసేసి తల్లి ఆత్మహత్య..

సారాంశం

హైదరాబాద్‌లోని బన్సీలాల్‌పేటలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను బిల్డింగ్‌పై నుంచి తోసేసి.. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది.

హైదరాబాద్‌లోని బన్సీలాల్‌పేటలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను బిల్డింగ్‌ పైనుంచి తోసేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు.. ఓ మహిళ డబుల్ బెడ్‌రూమ్ బిల్డింగ్ 8వ అంతస్తు నుంచి తన కూతురు, కొడుకును కిందకు తోసేసింది. ఆ తర్వాత ఆమె కూడా బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను సౌందర్య, ఆమె పిల్లలు నిత్య, నిదరీష్‌గా గుర్తించారు. అయితే కుటుంబ కలహాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అదనపు కట్నం కోసం భర్త నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నట్టుగా చెబుతున్నారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. ఈ ఘటనతో సౌందర్య కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సౌందర్య ఆత్మహత్య చేసుకోవడానికి ఆమె భర్త, అత్త వేధింపులే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్టుగా పోలీసులు తెలిపారు.

(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)

PREV
Read more Articles on
click me!

Recommended Stories

రాహుల్ గాంధీ రాముడైతే ఇయన హనుమంతుడు.. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సంగారెడ్డి భహిరంగ సభలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| CM Revanth Reddy Smart Ration Cards Launch