వైద్యం చేస్తానని నమ్మించి.. యువతిపై అత్యాచారం

Published : Apr 25, 2020, 09:33 AM IST
వైద్యం చేస్తానని నమ్మించి.. యువతిపై అత్యాచారం

సారాంశం

చంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన ఓ మహిళ గత కొంతకాలంగా  అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెకు బూతవైద్యం ద్వారా నయం చేస్తానని చెప్పాడు. ఆ వంకన సదరు మహిళ ఇంటికి వెళ్లి.. వాళ్ల ఇంట్లో ఉండే యువతితో పరిచయం పెంచుకున్నాడు.

వైద్యం చేస్తానని నమ్మించి ఇంటికి వచ్చి... యువతి ని కిడ్నాప్ చేసి  ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్  నగరంలోని చంద్రాయణగుట్టలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... చంద్రాయణగుట్టకు చెందిన ఓ మహిళకు బూత వైద్యం ద్వారా ఆరోగ్యం నయం చేస్తానంటూ ఓ యువకుడు నమ్మించాడు. అతని పేరు మహ్మద్ మోయిజుద్దీన్(27) కాగా... కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు.

చంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన ఓ మహిళ గత కొంతకాలంగా  అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెకు బూతవైద్యం ద్వారా నయం చేస్తానని చెప్పాడు. ఆ వంకన సదరు మహిళ ఇంటికి వెళ్లి.. వాళ్ల ఇంట్లో ఉండే యువతితో పరిచయం పెంచుకున్నాడు.

ఈ క్రమంలో.. సదరు యువతిపై కన్నేసి.. ఆమెను కిడ్నాప్ చేశారు. వారం రోజులపాటు యువతిని బంధించి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా.. యువతి కనిపించడం లేదని ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా.. వారం రోజుల తర్వాత ఇంటికి చేరిన యువతి తనపై అత్యాచారం జరిగినట్లు పోలీసులకు వివరించింది. కాగా.. సదరు యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
 
PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్