తెలంగాణలో జర్నలిస్టుకు కరోనా

By Sree sFirst Published Apr 25, 2020, 7:47 AM IST
Highlights

జర్నలిస్టులు కూడా ఈ కరోనా బారిన పడ్డ సందర్భాలను మనం చూసాము. ముంబైలో దాదాపుగా 60 మంది జర్నలిస్టులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. తమిళనాడులో ఒకే ఛానల్ లో పనిచేసే 27 మంది కరోనా బారిన పడ్డారు. తాజాగా తెలంగాణ కు చెందిన ఒక జర్నలిస్టుకు కూడా ఈ కరోనా వైరస్ సోకింది. 

కరోనా మహమ్మారిపై పోరులో డాక్టర్లు, పోలీసులు, ఇతర ఫ్రంట్ లైన్ సిబ్బందితోపాటుగా కష్టపడుతోంది జర్నలిస్టులు. ఈ కరోనా మహమ్మారికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు అందిస్తూ... ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతూ వారధిగా పనిచేస్తున్నారు. 

ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఇలా పనిచేయడమంటే చాలా రిస్కుతో కూడుకున్నపని. అయినా కూడా విధి నిర్వహణలో భాగంగా అన్నిటికి ఓర్చి తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు జర్నలిస్టులు. 

ఇలా పనిచేస్తున్న జర్నలిస్టులు కూడా ఈ కరోనా బారిన పడ్డ సందర్భాలను మనం చూసాము. ముంబైలో దాదాపుగా 60 మంది జర్నలిస్టులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. తమిళనాడులో ఒకే ఛానల్ లో పనిచేసే 27 మంది కరోనా బారిన పడ్డారు. తాజాగా తెలంగాణ కు చెందిన ఒక జర్నలిస్టుకు కూడా ఈ కరోనా వైరస్ సోకింది. 

ఈ జర్నలిస్టు గద్వాల జోగులాంబకు చెందినవాడు. అతడి తమ్ముడికి కరోనా సోకడంతో ఈ సదరు జర్నలిస్టును కూడా క్వారంటైన్ లో ఉంచారు. ఇలా క్వారంటైన్ లో ఉండగానే ఈ జరలిస్టుకు కూడా కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. 

వివరాల్లోకి వెళితే... ఈ సదరు జర్నలిస్టు తమ్ముడు పని మీద ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ కి వెళ్ళాడు. అక్కడి నుంచి ఈ జరన్లిస్ట్ తమ్ముడు కరోనా ని అంటించుకొని వచ్చిఉంటాడని బంధువులు భావిస్తున్నారు. 

తమ్ముడికి కరోనా సోకడంతో.... ఇతర బంధువులతోపాటుగా జర్నలిస్టును కూడా క్వారంటైన్ కి తరలించారు. ఇలా క్వారంటైన్ లో ఉండగానే జర్నలిస్టు కరోనా పాజిటివ్ గా తేలాడు. 

ఇకపోతే.... తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 13 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య రాష్ట్రంలో 983కు చేరుకుంది.

ఇప్పటి వరకు 291 మంది కోలుకుని ఆస్పత్రు నుంచి డిశ్చార్జీ అయ్యారు. యాక్టివ్ కేసులు 663 ఉన్నట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. ఇప్పటి వరకు 25 మంది మరణించినట్లు ఆయన తెలిపారు.

వికారాబాద్, గద్వాల, సూర్యాపేటల్లో ప్రత్యేక దృష్టి సారించి, ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ మూడు జిల్లాలో తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఆయన చెప్పారు. 

ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. కొద్ది మంది శాడిస్టులు ఉంటారని, వారు పుకార్లు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఎక్కడిదో ఫొటో తెచ్చి పోస్టు పెడుతున్నారని ఆయన అన్నారు. దానిపై బాధ్యతాయుతమైన వ్యక్తులు స్పందించడం దురదృష్టకరమని ఆయన అన్నారు. సైకోలు, శాడిస్టులు పంపే ఫొటోలను చూపించి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. 

సైకోలు, శాడిస్టులపై ఆధారపడి మాట్లాడడం బాధ్యతాయుతమైన వ్యక్తులకు తగదని ఆయన అన్నారు. కోరనా రోగులకు ఇస్తున్న ఆహార పదార్థాల వివరాలను ఆయన వివరించారు. అక్కడికి బిర్యానీ తెచ్చియ్యలేమని ఆయన అన్నారు. ప్రొటోకాల్ ను పక్కన పెట్టి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. 

663 మందితో నర్సులు, వైద్యులు పనిచేస్తుంటే వారి ఆత్మస్థయిర్యం దెబ్బ తినే విధంగా మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. ఆహార పదార్థాలు, టాయిలెట్లు బాగాలేవని డిశ్చార్జీ అయినవారు చెప్పారని ఆయన అన్నారు. గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయినవాళ్లే తమను చూసిన తీరును ప్రశంసించారని ఆయన అన్నారు. సులభ్ కాంప్లెక్స్ లో పనిచేసేవారిని తాను మాట్లాడి పంపించానని ఆయన చెప్పారు. డాక్టర్లను, నర్సులను అవమానిస్తే తీవ్రమైన చర్యలుంటాయని ఆయన అన్నారు.

click me!