హంతకులతో కలిసి ప్రచారమా....టీఆర్ఎస్ అభ్యర్థిని నిలదీసిన మహిళ

Published : Nov 30, 2018, 06:23 PM IST
హంతకులతో కలిసి ప్రచారమా....టీఆర్ఎస్ అభ్యర్థిని నిలదీసిన మహిళ

సారాంశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట టీఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లుకు ప్రచారంలో భాగంగా ఊహించని పరిణామం ఎదురయ్యింది. హంతకులను వెంటబెట్టుకుని ప్రచారంలో తిరగడమే కాకుండా...వాళ్లతో కలిసొచ్చి తనకు ఓటేయమని  ఎలా అడుగున్నావ్? అంటూ ఓ మహిళ ప్రశ్నించింది. మహిళ ఇలా నడిరోడ్డుపై టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రశ్నించడం నియోజకవర్గ పరిధిలో తీవ్ర చర్చనీయాంశమైంది. 

అశ్వారావుపేట నియోజకవర్గంలోని ఎర్రగుంట గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త పరుడి శ్రీనివాస్ గత సంవత్సరం ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యాడు. అయితే ఈ హత్యతో సంబంధమున్న కొందరు నిందితులు ఇటీవల గ్రామానికి ప్రచారం కోసం వచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్ రావు వెంట వున్నారు. ఈ విషయాన్ని గమనించిన శ్రీనివాస్ తల్లి చిట్టెమ్మ తాటిని అడ్డుకుని తన కొడుకును చంపిన వాళ్లను వెంటేసుకుని తిరుగుతున్నావా? అంటూ నిలదీసింది. 

ఆమెతో పాటు కుటుంబ సభ్యులంతా ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్య కేసులో నిందితులుగా వున్న వాళ్లను వెంటనే పార్టీలోంచి సస్పెండ్ చేయాలని తాటికి సూచించారు. 

ఈ ఘటనపై స్పందించిన తాటి వెంకటేశ్వర్లు... తన వెంట వచ్చిన చాలా మందిలో ఆ నిందితులు కూడా  ఉండివుంటారని...అసలు వాళ్లెవరో కూడా తనకు తెలియదన్నారు. కొడుకును కోల్పోయిన బాధలో ఆమె అలా మాట్లాడివుంటుందని తాటి తెలిపారు.  

PREV
click me!

Recommended Stories

Real estate: హైద‌రాబాద్‌లోని ఈ శివారు ప్రాంతం మ‌రో కూక‌ట్‌ప‌ల్లి కావ‌డం ఖాయం.. ఇప్పుడే కొనేయండి
Free Bus Scheme : తెలుగోళ్లకు గుడ్ న్యూస్... మహిళలకే కాదు పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం