డబ్బులిస్తే తీసుకోండి: విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

Published : Nov 30, 2018, 06:23 PM IST
డబ్బులిస్తే తీసుకోండి: విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ స్టార్ కాంపైనర్ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. బోధన్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున  పోటీ చేస్తున్న సుదర్శన్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె ఎన్నికల్లో పంచుతున్న డబ్బులు తీసుకోండి కానీ ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వెయ్యండని పిలుపునిచ్చారు.

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ స్టార్ కాంపైనర్ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. బోధన్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున  పోటీ చేస్తున్న సుదర్శన్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె ఎన్నికల్లో పంచుతున్న డబ్బులు తీసుకోండి కానీ ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వెయ్యండని పిలుపునిచ్చారు. 

తెలంగాణలో దొరల పాలనను తరిమికొట్టాలని విజయశాంతి పిలుపునిచ్చారు. తెలంగాణ ఇచ్చిన యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీకి కాంగ్రెస్ ను గెలిపించి రుణం తీర్చుకుందామని కోరారు. తెలంగాణలో ఓట్లు చీలకూడదన్నఉద్దేశంతోనే తాము టీడీపీతో పొత్తుపెట్టుకున్నట్లు తెలిపారు. 

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల సొమ్మును నాలుగేళ్లు దోచుకున్నారని విజయశాంతి మండిపడ్డారు. ఎన్నికల్లో పంచుతున్న డబ్బు తీసుకోండి కానీ ఓటు మాత్రం కాంగ్రెస్ కు వెయ్యండని ప్రజలను కోరారు. 

మెుత్తానికి విజయశాంతి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నికల్లో డబ్బులు తీసుకోండి ఓటు మాత్రం కాంగ్రెస్ కు వెయ్యండి అనడం ఎన్నికల నిబంధనలకు విరుద్దం అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే విజయశాంతి టంగ్ స్లిప్ పై ఎలక్షన్ కమిషన్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 
 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం