మహిళ అపైర్: భర్తను ప్రియుడితో చంపించి, ఆ తర్వాత....

Published : Feb 27, 2021, 07:28 AM IST
మహిళ అపైర్: భర్తను ప్రియుడితో చంపించి, ఆ తర్వాత....

సారాంశం

ఓ మహిళ తన భర్త రాజయ్యను ప్రియుడితో చంపించింది. ఆ తర్వాత తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో రాజయ్య మృతదేహం కెనాల్ లో కనిపిచింది. కేసును పోలీసులు ఛేదించారు.

కరీంనగర్: ఓ మహిళ తన భర్తను ప్రియుడితో చంపించింది. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి గ్రామానికి చెందిన మానుపాటి రాజయ్య (40) నగర పాలక సంస్థలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. 

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మడద గ్రామానికి చెందిన ఎనగందుల బాబు మేస్త్రీ పనిచేసుకుంటూ జీవితం గడుపుతున్నాడు. ఇద్దరికి అప్పు ఇచ్చిపుచుకునే క్రమంలో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో బాబు రాజ్య్య భార్యకు దగ్గరయ్యాడు. దీంతో రాజయ్య భార్యను మందలించాడు. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. 

తన భర్తను అడ్డు తొలగించాలని రాజయ్య భార్య బాబును కోరింది. దీంతో ఈ నెల 5వ తేదీన విందు కోసని చెప్పి బాబు తన సొంత ఆటోలో రాజయ్యను మడదకు తీసుకుని వెళ్లాడు. రాజయ్యతో మద్యం తాగించాడు. మద్యం మత్తులో రాజయ్య స్పృహ తప్పాడు. 

ఆ తర్వాత బాబు రాజయ్యను మానకొండూరు మండలం ముంజంపల్లి కాకతీయ కెనాల్ వద్దకు తీసుకుని వెళ్లాడు రాజయ్య మెడ పిసికి కెనాల్ లో పడేశాడు. ఆ తర్వాత తన భర్త ఇంటికి రాలేదని రాజయ్య భార్య ఈ నెల 5వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఈ నెల 19వ తేదీన రాజయ్య మృతదేహం మహబూబాబాద్ జిల్లా కొరివి పోలీసు స్టేషన్ పరిధిలోని కాకతీయ కెనాల్ లో కనిపించింది విచారణలో రాజయ్య భార్య నేరం అంగీరించింది. రాజయ్యను భార్యను, బాబును అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu
Revanth Reddy Press Meet: సర్పంచ్ ల గెలుపు పై రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ | Asianet News Telugu