బీజేపీలోకి కపిలవాయి: కేసీఆర్ కోసం ఈడీ రెడీ... సర్కార్ కూలిపోబోతోందంటూ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Feb 26, 2021, 8:03 PM IST
Highlights

మహబూబ్‌నగర్- హైదరాబాద్- రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన కపిలవాయి దిలీప్ కుమార్ తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. బీజేపీలో చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

మహబూబ్‌నగర్- హైదరాబాద్- రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన కపిలవాయి దిలీప్ కుమార్ తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు.

బీజేపీలో చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అనంతరం దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న రాంచందర్‌కు మద్ధతు తెలిపారు. బండి సంజయ్ విజ్ఞప్తి మేరకు నామినేషన్‌ను విత్ డ్రా చేసుకుంటున్నట్లు కపిలవాయి పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కేటీఆర్ కుటిల రాజకీయ వేత్త అని... ఆయన ఎలాంటి గేమ్స్ ఆడతారో అందరికీ తెలుసునని ఆయన ఆరోపించారు. పీవీ ప్రధానమంత్రిగా దిగిపోయాక కేసీఆర్, తాను కలిసి ఆయనను ఢిల్లీలో కలిశామని కపిలవాయి వెల్లడించారు.

ఆనాడు పీవీని సమైక్యవాది అని కేసీఆర్ వ్యాఖ్యానించారని ఆయన గుర్తుచేశారు. అలాంటి కేసీఆర్‌‌కి పీవీ గుర్తుకు రావడం విడ్డూరంగా వుందన్నారు. వాణి అభ్యర్ధిత్వంతో కుల పంచాయతీ పెట్టాలని బ్రాహ్మణ ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని దిలీప్ కుమార్ ఆరోపించారు.

కేసీఆర్‌కు పీవీ నరసింహారావు మీద ఎలాంటి ప్రేమా లేదని.. వాణీదేవి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలి పశువు కాబోతోందని ఆయన ఎద్దేవా చేశారు. ఉద్యోగస్తులకు ఫిట్‌మెంట్ సరిగా ఇవ్వలేదని.. నిరుద్యోగులు తీవ్రమైన నిరాశతో వున్నారని కపిలవాయి మండిపడ్డారు.

కేసీఆర్ చెప్పేదంతా అరచేతిలో స్వర్గమేనని.. అందరినీ మోసం చేసేందుకే వాణీదేవిని అభ్యర్ధిగా ప్రకటించారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఎవరికీ అవకాశం వచ్చిన వారు వినియోగించుకోవాలని దిలీప్ కుమార్ పిలుపునిచ్చారు.

విపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని.. సీఎం మాటలకు లొంగొద్దని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు వుండదని.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసీఆర్‌పై దాడులు చేసేందుకు సిద్ధంగా వుందని ఆరోపించారు.

కేసీఆర్ సంపాదన అంబానీ కన్నా ఎక్కువని.. ఈ జాబితా ఈడీ వద్ద వుందని పేర్కొన్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సీఎం కోటరీ చుట్టూ రైడ్స్ చేయవచ్చని దిలీప్ కుమార్ అభిప్రాయపడ్డారు.

ఘంటా చక్రపాణి తన పదవి విరమణ సందర్భంగా 38 వేల ఉద్యోగాలు ఇచ్చాం అని చెప్పారని ఆయన గుర్తుచేశారు. అధికారంలోకి రాగానే లక్ష ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇంటికో ఉద్యోగం అన్నారని.. ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగాలపై ప్రభుత్వం శ్వేత పత్రం ఇవ్వాలని కపిలవాయి డిమాండ్ చేశారు. 

click me!