మైనర్ బాలుడితో ప్రేమ.. భర్త అడ్డుగా ఉన్నాడని..

Published : Jul 16, 2021, 07:34 AM IST
మైనర్ బాలుడితో ప్రేమ.. భర్త అడ్డుగా ఉన్నాడని..

సారాంశం

భర్తను కాదని మైనర్ బాలుడితో సదరు మహిళ ఎఫైర్ పెట్టుకోగా... దానికి ఆమె సోదరి దగ్గరుండీ సహకరించడం గమనార్హం. 

మైనర్ బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. దానికి అడ్డుగా ఉన్నాడని ఏకంగా కట్టుకున్న భర్తనే హత్య చేసింది. ఈ సంఘటన కొత్తగూడెం పట్టణంలో చోటుచేసుకుంది. హత్య చేసిన తర్వాత ఏమీ ఎరగనట్టు నాటకమాడగా.. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం తెలిసింది.

భర్తను కాదని మైనర్ బాలుడితో సదరు మహిళ ఎఫైర్ పెట్టుకోగా... దానికి ఆమె సోదరి దగ్గరుండీ సహకరించడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇల్లెందు గ్రామీణం పోచారానికి చెందిన భూక్యా మంగీలాల్(28) ఇటీవల దారుణ హత్యకు గురయ్యాడు. ఇతని హత్యకేసు దర్యాప్తులో భాగంగా.. నేరం చేసింది అతని భార్యేనన్న విషయం తెలిసింది.

భూక్యా మంగీలాల్ భార్య మాధవికి.. అదే ప్రాంతానికి చెందిన మేకలు కాసే బాలుడితో గతంలో పరిచయం ఏర్పడింది. అతను మైనర్ బాలుడు అయినా... అతనితో పరిచయం పెంచుకొని... అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరిద్దరూ కలిసి ఉండేందుకు మాధవి సోదరి సహకరించేది.

ఈ క్రమంలో.. మాధవికి భర్త అడ్డుగా అనిపించడంతో.. అతనిని తొలిగించుకోవాలని ప్లాన్ వేసింది. అందుకు తన ప్రియుడు, అతని స్నేహితుడు ప్రేమ్ కుమార్ కలిసి ప్లాన్ వేసి.. భూక్యా మంగీలాల్ ని.. కర్రలతో కొట్టి దారుణంగా చంపేశారు. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని అటవీప్రాంతలో పడేశారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులకు మాధవి ప్రియుడు, అతని స్నేహితుడు ప్రేమ్.. మంగీలాల్ పై దాడి చేయడం కనపడింది. వారిని పిలిచి ప్రశ్నించగా.. అసలు విషయాలన్నీ బయటకు వచ్చాయి. 

PREV
click me!

Recommended Stories

Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్