హైదరాబాద్ శివారు శంషాబాద్ లో ఓ గుర్తు తెలియని మహిళను హత్య చేశారు దుండగులు. ఆ తరువాత పెట్రోల్ పోసి, నిప్పంటించారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని శంషాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. శంషాబాద్ పరిధిలోని శ్రీనివాస కాలనీలో ఓ గుర్తు తెలియని మహిళ(40)ను దుండగులు దారుణంగా హతమార్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేకెత్తించింది. మహిళను చంపిన తర్వాత దుండగులు మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
దీనికి సంబంధించి సమాచారం అందడంతో పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
శంషాబాద్ సాయి ఎంక్లేవ్ లో నివాస స్థలాల మధ్య కాలిపోయిన స్థితిలో మహిళ మృతదేహం కలకలం రేపింది.
ఎక్కడో చంపేసి.. మహిళ మృతదేహాన్ని శంషాబాద్ శివారులోని సాయి ఎంక్లేవ్ నదగ్గరికి తీసుకువచ్చిన దుండగులు.. ఇక్కడ పడేసి పెట్రోల్ పోసిని పట్టించారు. దీనికి సంబంధించి సమాచారం అందడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఆనవాలు లేకుండా చేయాలని పెట్రోల్ పోసినిప్పంటించినట్టుగా అనుమానిస్తున్నారు. మహిళ మీద అత్యాచార యత్నం జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు. చేస్తున్నారు. మహిళ వయసు 40 సంవత్సరాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మహిళను ఎందుకు చంపారు? అనే దానిమీద ఇంకా వివరాలు తెలియ రాలేదు.
నిందితులను పట్టుకోవడానికి పోలీసులునాలుగు బృందాలుగా మారి గాలిస్తున్నాయి. అత్యాచారం చేసి హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సాంకేతిక ఆధారాలు సేకరించామని, క్లూస్ టీం, డాగ్స్ వర్డ్ అందించిన వివరాలు..మహిళ పోస్టుమార్టం డీటెయిల్స్ వచ్చిన తర్వాత కానీ ఏమీ వివరాలు చెప్పలేమని పోలీసులు అంటున్నారు.
మరోవైపు.. హత్యాప్రాంతానికి అత్యంత సమీపంలో ఓ పెట్రోల్ బంక్ ఉంది. హత్యకు 20ని.ల ముందు దగ్గర్లోని పెట్రోల్ బంకులో డీజీల్ తీసుకెళ్లారు. ఆ బంకు దగ్గరికి హత్యకు 20ని.లముందు ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చి డీజిల్ బాటిల్ లో పోయమని అడిగారు. అందులో పోయమని చెప్పడంతో.. మళ్లీ కాసేపటికి 5లీటర్ల డబ్బా తీసుకొచ్చి డీజిల్ తీసుకెళ్లారు.ఇదంతా అక్కడి సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో.. వీరిద్దరికీ, హత్యకు ఏమైనా సంబంధం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీరిద్దరి కోసం దర్యాప్తు ప్రారంభించారు. వారి బండి నెం.తో వారిద్దరి కోసం గాలిస్తున్నారు.
శంషాబాద్ లో కలకలం రేపిన మహిళ హత్య కేసు విషయంలో శంషాబాద్ ఏసిపి రామచంద్రారావు మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ‘చనిపోయింది మహిళగా గుర్తించాం. అయితే ఆమెను ఇక్కడ చంపేశారా లేదా అనేది స్పష్టత లేదు. వేరే ప్రాంతంలో చంపేసి తీసుకువచ్చారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. దీనికోసం నాలుగు టీంలను ఏర్పాటు చేశాం. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నాం.
సీసీ కెమెరాల్లో టు వీలర్ మీద తీసుకువచ్చినట్లుగా కనిపిస్తోంది. టూ వీలర్ మీద వచ్చిన వ్యక్తుల ఆచూకీ కోసం దర్యాప్తు టీంలు వెతుకుతున్నాయి. ఈ ప్రాంతం ఓఆర్ఆర్ కు అనుకుని ఉంది. ఇలాంటి నిర్మానుష్య ప్రాంతాలలో క్రైమ్ కు అనుకూలంగా ఉంటుందని నిందితులు ఎక్కువగా ఎంచుకుంటున్నారని’ ఏసీబీ తెలిపారు.