
ఓ మహిళ ప్రియుడితో కలిసి ఉండేందుకు భర్తను కిడ్నాప్ చేయించి బలవంతంగా విడాకులు తీసుకుంది. కాగా.. బాధితుడిని రక్షించిన పోలీసులు.. మహిళతోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మార్కెట్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ నాగేశ్వరరావు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం... మౌలాలీ ఆర్టీసీ కాలీనీ చెందిన షేక్ వాజీద్(31), ఆప్షియా బేగం(24)లకు 20212లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
వాజీద్ బస్టాండ్ ప్రాంతంలోని చెప్పుల దుకాణంలో సేల్స్ మెన్. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఆప్షియా బేగంకు ముషీరాబాద్ కు చెందిన క్యాటరింగ్ పనులు చేసే ఆసిఫ్ పరిచయమయ్యాడు. అతనికి గతంలో రెండుసార్లు వివాహం జరిగి పిల్లలున్నారు. ఆసియా బేగం గత ఏప్రిల్ ఇంట్లో చెప్పకుండా ప్రియుడి వద్దకు వెళ్లిపోయింది. ఆమె భర్త మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఆమెను గుర్తించి భర్తకు అప్పగించారు.
అయినా మరోసారి పిల్లలతో కలిసి ప్రియుడి వద్దకే వెళ్లిపోవడంతో అత్తమామల సహాయంతో తిరిగి తీసుకువచ్చాడు. భర్తతో ఉండటం తనకు ఇష్టం లేదని.. విడాకుల కోసం ఆమె ఒత్తిడి తీసుకువచ్చింది. అందుకే అతను అంగీకరించలేదు. ఎలాగైనా ప్రియుడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయిచుకున్న ఆప్షియా బేగం అతడితో కలిసి కిడ్నాప్ పథకం వేసింది.
దీంతో.. ఆసిఫ్ ముషీరాబాద్, పార్సిగుట్టకు చెందిన ఇమ్రాన్ మహ్మద్(31), ఎండీ జాఫర్(33), ఇర్ఫాన్ అహ్మద్, మహమూద్ ఇందుకు సిద్ధం చేశాడు. వీరు నలుగురు పథకం ప్రకారం షేక్ వాజీద్ ని కిడ్నాప్ చేశారు. బలవంతంగా మత పెద్దల సమక్షంలో విడాకులు తీసుకున్నారు. కాగా.. ఈ కిడ్నాప్ విషయాన్ని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిని పోలీసుల రక్షించారు. కిడ్నాప్ కి పాల్పడిన వారిలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.