కిలేడీలు : మత్తులో ఉన్నవారితో మాటలు కలిపి.. నిలువు దోపిడి.. !

Published : Jul 30, 2021, 10:40 AM IST
కిలేడీలు : మత్తులో ఉన్నవారితో మాటలు కలిపి.. నిలువు దోపిడి.. !

సారాంశం

దీనిపై వచ్చిన సమాచారంతో దొంగతనాలకు పాల్పడుతున్న మహిళలతో పాటు మరో వ్యక్తిపై నిఘా వేశారు. ఎట్టకేలకూ డబ్బులు కాజేస్తున్న విషయం నిజం అని తేలడంతో మహిళలను విచారించినట్లు తెలిసింది. 

మద్యం మత్తులో ఉన్నవారే వారి టార్గెట్. వారిని మాటల్లో దింపి.. జేబులు కొల్లగొడుతున్నారు.. కొంతమంది కిలాడీ లేడీలు. దీంట్లో ఆరితేరిన ‘కిలేడీ’లు సిరిసిల్ల టౌన్ పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సిరిసిల్ల పాత మార్కెట్ ఏరియాలోని కల్లు కాంపౌండ్ ను అడ్డాగా చేసుకుని ముగ్గురు మహిళలు, మరో వ్యక్తి మందుబాబుల జేబుల్లోంచి డబ్బులు కాజేస్తున్నట్లు తెలిసింది.

దీనిపై వచ్చిన సమాచారంతో దొంగతనాలకు పాల్పడుతున్న మహిళలతో పాటు మరో వ్యక్తిపై నిఘా వేశారు. ఎట్టకేలకూ డబ్బులు కాజేస్తున్న విషయం నిజం అని తేలడంతో మహిళలను విచారించినట్లు తెలిసింది. 

ఇప్పటివరకు వీరు మూడు రోజుల క్రితం రూ. 30 వేలు దొంగతనం చేశారని, వారి చిరునామాలు, రోజువారి పనులు తెలుసుకునే పనిలో సిరిసిల్ల టౌన్ పోలీసులు నిమగ్నమైనట్లు తెలిసింది. ఇదే విషయాన్ని సిరిసిల్ల టౌన్ ఎస్సై అపూర్వ రెడ్డిని వివరణ కోరగా మూడు రోజుల క్రితం సమాచారం వచ్చిందని దీనిమీద దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Heavy Rains: హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం ఏపీకి పొంచి ఉన్న వరద ముప్పు | Andhra Pradesh Weather
Heavy Rains: హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం ఏపీకి పొంచి ఉన్న వరద ముప్పు | Andhra Pradesh Weather