
యాదగిరిగుట్ట (yadagirigutta) శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి దేవాలయం (sri lakshmi narasimha swamy) వద్ద విషాదం చోటు చేసుకుంది. కొండ కింద లక్ష్మీ పుష్కరిణీలో పుణ్య స్నానానికి దిగిన భక్తురాలు మృతి చెందింది. మృతురాలిని హైదరాబాద్ (hyderabad) గుడి మల్కాపూర్‌కి (gudimalkapur) చెందిన రోజాగా గుర్తించారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు ఆలయ అధికారులు స్పందించలేదు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.