సీఐడీకి చేరిన ఆదిలాబాద్ డీసీసీబీ కుంభకోణం..

Published : Mar 16, 2022, 06:30 AM ISTUpdated : Mar 16, 2022, 06:32 AM IST
సీఐడీకి చేరిన ఆదిలాబాద్ డీసీసీబీ కుంభకోణం..

సారాంశం

ఆదిలాబాద్ లోని డీసీసీబీ బ్యాంకు లో కోట్లలో జరిగిన కుంభకోణం కేసు ఎట్టకేలకు సీైడీకి చేరింది. ఈ కేసులో ఇప్పటికే 11మంది సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. 

ఆదిలాబాద్ :  ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) బేల బ్రాంచ్లో వెలుగుచూసిన కుంభకోణం కేసు సిఐడికి చేరింది. ఈ మేరకు DCCB డిప్యూటీ జనరల్ మేనేజర్ నాగాంజలి,  అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ తో కూడిన అధికారుల బృందం మంగళవారం హైదరాబాద్లో CIDకి ఫిర్యాదు చేసినట్లు  dccb సీఈవో శ్రీధర్ రెడ్డి తెలిపారు.

ఆర్థిక లావాదేవీల్లో ప్రధాన సూత్రధారి బేల బ్రాంచ్ స్టాఫ్ అసిస్టెంట్ కం క్యాషియర్ శ్రీపతికుమార్ సహా 11 మంది ఉద్యోగులను అధికారులు ఇప్పటికే సస్పెండ్ చేశారు. ఆర్బిఐ, నాబార్డు నిబంధనల ప్రకారం సిఐడికి అప్పగించాలంటే ముందుగా జిల్లాస్థాయిలో పోలీసు కేసు నమోదు చేయాలనే నిబంధనల మేరకు ఈ నెల 13న అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు బేల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ముందుగా రూ.2,86,40,000  దుర్వినియోగం అయినట్లు భావించినా  ప్రాథమిక విచారణలో రూ.1.40  లక్ష లకు సంబంధించిన లావాదేవీలకు ఆధారాలు లభించాయి.

మిగిలిన రూ.2.85  కోట్లు దుర్వినియోగం జరిగినట్లు తేల్చిన అధికారులు సిఐడికి ఫిర్యాదు చేసినట్లు శ్రీధర్రెడ్డి వివరించారు.  వీటికి సంబంధించి మంగళవారం నుంచి ఆదిలాబాద్లోని ప్రధాన కార్యాలయంలో జైనథ్ షీఐ కోల నరేష్ నేతృత్వంలో విచారణ ప్రారంభం అయింది.

ఇదిలా ఉండగా, కంచె చేను మేసినట్టు జరిగిన కేసులో గత గురువారం భేళా మండల కేంద్రంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) బ్యాంకు శాఖలో రూ.2.86 కోట్ల కుంభకోణానికి పాల్పడిన నలుగురు మేనేజర్‌లతో సహా 11 మంది సిబ్బందిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సస్పెండ్ అయిన వారిలో పి శ్రీపత్ కుమార్, వై రాణిత, టి రాజేశ్వర్, ఎ రాహుల్, బి రమేష్, బి ప్రవీణ్, బి వేణుగోపాల్, కె రమేష్ కుమార్, ఎం సవిత ఉన్నారని డిసిసిబి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె శ్రీధర్ రెడ్డి తెలిపారు.

ఎస్ ప్రవీణ్, ఎం నితిన్ ఆదిలాబాద్ మెయిన్ బ్రాంచ్‌లో పనిచేస్తున్నారు. బ్యాంకు అధికారులు జరిపిన ప్రాథమిక విచారణలో శ్రీపత్‌కుమార్‌, ఇతర సిబ్బంది తమ బంధువుల ఖాతాల్లోకి, ఆపై వారి ఖాతాల్లోకి మోసపూరితంగా నగదు బదిలీ చేసినట్లు తేలింది. నిధులు స్వాహా చేసిన ఖాతాలను స్తంభింపజేసి సంబంధిత ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ కుంభకోణానికి శ్రీపత్ సూత్రధారిగా ఉన్నట్లు సమాచారం.

ఒకటి రెండు రోజుల్లో లక్ష రూపాయలకు పైగా కుంభకోణం జరిగినందున క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సిఐడి)కి ఫిర్యాదు చేయనున్నట్లు శ్రీధర్ రెడ్డి తెలిపారు. బ్యాంకు యాజమాన్యం ఇటీవల నిర్వహించిన వార్షిక ఆడిట్‌లో వివిధ ఖాతాలకు అక్రమంగా నిధులు మళ్లించినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు.

 

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం