వేముల‌వాడ‌లో దారుణం.. పిల్లల గొంతు కోసి.. తాను ఆత్మహత్య..

Published : Dec 18, 2021, 07:46 PM IST
వేముల‌వాడ‌లో దారుణం.. పిల్లల గొంతు కోసి.. తాను ఆత్మహత్య..

సారాంశం

వేములవాడ‌లో దారుణం చోటు చేసుకుంది. ఒక వివాహిత త‌న ఇద్ద‌రి పిల్ల‌ల‌తో ఆత్మ‌హ‌త్య య‌త్నం చేసింది.  జ‌గిత్యాల జిల్లా కొడిమ్యాల కు చెందిన మ‌మ‌త అనే త‌ల్లి త‌న కుమార్తే అయిన అక్ష‌య‌, కుమారుడు వ‌రుణ్ తేజ్ గొంతు కోసి తాను గొంతు కోసుకుంది. అయితే స్థానికులు గ‌మ‌నించి సిరిసిల్లాలో ని ఆస్ప‌త్రి కి త‌ర‌లించారు. కుటుంబ క‌ల‌హాలతోనే ఈ దారుణానికి పాల్ప‌డినట్టు తెలుస్తోంది.  

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మ‌హిళ త‌న ఇద్ద‌రి పిల్ల‌ల గొంతు కోసి.. తాను కూడా గొంతు కోసుకొని చ‌నిపోయింది. వివరాల్లోకెళ్తే.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం దమ్మపేట గ్రామానికి చెందిన మమత అనే మహిళ తన పిల్లలు వరుణ్‌తేజ, అక్షయతో సహా 15 రోజుల క్రితం కామారెడ్డిలోని తల్లిదండ్రులు ఇంటికి వెళ్లింది.   అయితే తిరుగు ప్రయాణంలో వేములవాడకు చేరుకుంది. వేములవాడ ప్రాంతంలో త‌న కుమార్తే అయిన అక్ష‌య‌, కుమారుడు వ‌రుణ్ తేజ్ గొంతు కోసి తాను గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

ఈ దారుణాన్ని గమనించిన స్థానికులు సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు.  కుటుంబ క‌ల‌హాల తో నే త‌ల్లి మమ‌త ఈ అఘాత్యానికి ఒడి గ‌ట్టింద‌ని తెలు స్తుంది. అయితే అత్త‌గారి ఇంటి వ‌ద్ద క‌లహాలు రావ‌డం తో పుట్టింటికి రావ‌డానికి ఈ రోజు ఉద‌యం బ‌య‌లు దేరింది. అయితే పుట్టింటికి వ‌స్తున్న క్ర‌మంలో మార్గ మ‌ధ్య లో వేములవాడ ప‌ట్ట‌ణానికి శివారు లో త‌ల్లి మ‌మ‌త ఈ అఘాత్యానికి పాల్ప‌డింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్