పెళ్లి కుదరడం లేదని.. యువతి ఆత్మహత్య

Published : Jan 16, 2019, 03:38 PM IST
పెళ్లి కుదరడం లేదని.. యువతి ఆత్మహత్య

సారాంశం

తాను లావుగా ఉన్నానని.. అందుకే తనను వివాహం చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడంలేదని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. 

తాను లావుగా ఉన్నానని.. అందుకే తనను వివాహం చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడంలేదని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన  కరీంనగర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మండలంలోని స్తంభంపల్లి గ్రామానికి చెందిన తంగళ్లపల్లి అనిత(27) పెళ్లి కావడం లేదనే మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. లావుగా ఉండటం కారణంగానే తనను ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదని ఆమె తరచూ బాధపడేది. దీంతో మానసింగా కుంగిపోయింది. అంతేకాకుండా గత 15రోజులుగా ఆమెకు ఆరోగ్యం కూడా సరిగా ఉండటం లేదు. దీంతో ఆమెను తల్లిదండ్రులు మానసిక వైద్యుని వద్ద చికిత్స చేయించారు.

రెండు రోజులు బాగానే ఉన్నట్లు అనిపించినా.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు