అత్తింట్లో నవ వధువు ఆత్మహత్య... ఒకరిని ప్రేమించి.. మరొకరితో వివాహం..

By AN Telugu  |  First Published Dec 29, 2020, 11:32 AM IST

ప్రేమించిన వ్యక్తిని కాదని తల్లిదండ్రులు మరో యువకుడితో పెళ్లి చేశారని అత్తవారింట్లోనే ఉరి వేసుకుని నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్ గ్రామంలో విషాదం నింపింది. 

పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరికి చెందిన రవళితో వరంగల్ అర్బన్ జిల్ల భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్ కు చెందిన రాజుకు 16 రోజుల క్రితం పెళ్లి జరిగింది. 

Latest Videos

ఇష్టం లేని పెళ్లి చేశారంటూ సూసైడ్ నోట్ రాసి సోమవారం రాత్రి అత్తవారింట్లోనే నవ వధువు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నా చావుకు ఎవరూ కారణం కాదు. అమ్మా నీకు తెలుసు. కులం, మతం చూడొద్దు. భర్తకు క్షమాపణ చెబుతున్నా.. అని ఆత్మహత్యకు ముందు రాసి ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

పెళ్లైన పదిహేను రోజులకే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు, బంధువులు రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

click me!